AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaji Talwar: ఫలించిన కృషి.. స్వదేశానికి తిరిగి రానున్న శివాజీ ఆయుధం వాఘ్‌ నఖ్.. ఈ ఖడ్గం స్పెష్టాలిటీ, ఎప్పుడు ప్రదర్శనకు పెడతారంటే..

మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ శివాజీ ఉపయోగించిన ఈ ఆయుధాన్ని తీసుకొచ్చేందుకు కావాల్సిన ఒప్పంద పత్రాలపై అక్టోబర్ 3వ తేదీ మంగళవారం లండన్‌లో సంతకాలు చేయనున్నారు. నవంబర్‌లో వాఘ్‌ నఖ్‌ను భారత్‌కు తీసుకొస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ 1659లో బీజాపూర్ సుల్తానేట్ జనరల్ అఫ్జల్ ఖాన్‌ను ఓడించిన రోజునే ఈ ఖడ్గాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Shivaji Talwar: ఫలించిన కృషి.. స్వదేశానికి తిరిగి రానున్న శివాజీ ఆయుధం వాఘ్‌ నఖ్.. ఈ ఖడ్గం స్పెష్టాలిటీ, ఎప్పుడు ప్రదర్శనకు పెడతారంటే..
Chhatrapati Shivaji
Surya Kala
|

Updated on: Oct 02, 2023 | 8:23 AM

Share

పరాయిపాలకుల చేతిలో బంధీ అయిన మాతృభూమి సంరక్షణ కోసం బెబ్బులిలా కధనరంగంలో దూకిన మహావీరుడు.. భారత గడ్డ స్వయం పాలన కోసం నినాదించిన తొలి గొంతు.. విజయమో వీర స్వర్గమో అని 16 ఏల్ల వయస్సులొ కత్తిపట్టి .. చేసిన మూడు వందల యుద్ధాల్లో ఒకటికూడా ఓడిపోని వీరుడు ఛత్రపతి శివాజీ. భవాని మాత అనుగ్రహంతో చంద్రహాస్ ఖడ్గం పొంది హిందూ ధర్మ రక్షణ చేసిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వాడిన ఒక ఆయధం త్వరలో భారత్‌కు రానుంది. శివాజీ పట్టాభిషేకం జరిగిన 350 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రిటన్‌ మ్యూజియంలో ఉన్న వాఘ్‌ నఖ్‌ను ముంబైకి తీసుకొస్తున్నారు.

మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి.. హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన న మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఉపయోగించిన ఆయుధం తిరిగి భారత్‌కు రానుంది. ఈ ఏడాది తో ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని శివాజీ ఉపయోగించిన వాఘ్‌ నఖ్‌ .. పులి గోళ్లను మహారాష్ట్ర ప్రభుత్వం భారత్‌కు తీసుకొస్తుంది. ‘వాఘ్ నఖ్’ అనేది ఉక్కు ఆయుధం. ఇది ఒక బార్‌పై అమర్చబడిన నాలుగు గోళ్లను కలిగి ఉంటుంది

మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ శివాజీ ఉపయోగించిన ఈ ఆయుధాన్ని తీసుకొచ్చేందుకు కావాల్సిన ఒప్పంద పత్రాలపై అక్టోబర్ 3వ తేదీ మంగళవారం లండన్‌లో సంతకాలు చేయనున్నారు. నవంబర్‌లో వాఘ్‌ నఖ్‌ను భారత్‌కు తీసుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ 1659లో బీజాపూర్ సుల్తానేట్ జనరల్ అఫ్జల్ ఖాన్‌ను ఓడించిన రోజునే ఈ ఖడ్గాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ మ్యూజియంలో ముందుగా ఈ ఖడ్గాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. అయితే దేశంలోని మరో నాలుగు ప్రముఖ ప్రాంతాల్లో ఈ ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి పాలకులాగా మారిన బ్రిటిష్ వారు మన దేశ సంపదను. అపురూప వస్తువులను ఎన్నింటిలో తమ దేశానికి తరలించారు. అలాంటి వాటిలో ఒకటి శివాజీ ఉపయోగించిన వాఘ్‌ నఖ్‌. ఇది ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్‌బర్ట్‌ మ్యూజియంలో ఉంది. ఇది 17వ శతాబ్దం నాటిదని మ్యూజియం రికార్డుల్లో పేర్కొన్నారు. బీజపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్‌ను శివాజీ యుద్ధంలో ఇదే వాఘ్‌ నఖ్‌తో హతమార్చినట్లు చరిత్ర చెబుతోంది.

భార‌త‌దేశానికి చెందిన ఎన్నో విలువైన వ‌స్తువుల‌ను బ్రిటిష‌ర్లు లండ‌న్ త‌రలించి అక్కడి మ్యూజియంల‌లో పెట్టుకున్నారు. వాటిని వెన‌క్కి ర‌ప్పించ‌డానికి భార‌త ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. 1820లో భార‌త్‌ను దాటి వెళ్లిపోయిన ఈ శివాజీ ఆయుధం సుమారు 200 ఏళ్ల త‌ర్వాత ఇక్కడికి తీసుకొస్తున్నారు. 1659లో జ‌రిగిన ప్రతాప్‌ఘడ్‌ యుద్దం చరిత్రలో చాలా కీలకమైంది. ఈ యుద్ధంలో అఫ్జల్‌ఖాన్ నేతృత్వంలోని ఆదిల్‌షాహీ సైన్యాన్ని ఓడించిన శివాజీ.. త‌న రాజ్యాన్ని న‌లుదిక్కులా విస్తరించాడు. ఈ యుద్ధ స‌మ‌యంలోనే సంధి కోస‌మ‌ని శివాజీని తన శిబిరానికి అఫ్జల్‌ఖాన్‌ ఆహ్వానిస్తాడు. నిజానికి శివాజీని చంపేయ‌డానికి ప‌న్నాగం ఇది. ముందుజాగ్రత్తగా శివాజీ త‌న పులిపంజాను ర‌హ‌స్యంగా చేతి కింద పెట్టుకుని వ‌స్తాడు. తనను పొడిచేందుకు ప్రయత్నించిన అఫ్జల్‌ఖాన్‌ను వాఘ్‌నఖాతో చంపేస్తాడు శివాజీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..