London Bridge: లండన్ బ్రిడ్జ్ లేచింది.. కానీ మళ్లీ దిగలేదు.. అసలేం జరిగింది..?
లండన్‌లోని థేమ్స్ నదిపై టవర్ బ్రిడ్జ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ వంతెన ఇటు నదీ ప్రయాణానికీ, అటు రోడ్డు రవాణాకూ వీలుగా నిర్మించారు. నదిలో పడవలు, ఎత్తయిన షిప్‌లు ప్రయాణిస్తున్న సమయంలో ఈ వంతెన పైకి లేస్తుంది. పడవ వెళ్లిపోగానే ఆ బ్రిడ్జి యథావిథిగా కిందకు దిగుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియే. రైల్వే గేటు పడగానే వాహనదారులు ఇరువైపులా ఎలా ఆగిపోతారో అలాగే ఇక్కడకూడా వంతెన పైకి లేచిన సమయంలో..
లండన్‌లోని థేమ్స్ నదిపై టవర్ బ్రిడ్జ్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ వంతెన ఇటు నదీ ప్రయాణానికీ, అటు రోడ్డు రవాణాకూ వీలుగా నిర్మించారు. నదిలో పడవలు, ఎత్తయిన షిప్‌లు ప్రయాణిస్తున్న సమయంలో ఈ వంతెన పైకి లేస్తుంది. పడవ వెళ్లిపోగానే ఆ బ్రిడ్జి యథావిథిగా కిందకు దిగుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియే. రైల్వే గేటు పడగానే వాహనదారులు ఇరువైపులా ఎలా ఆగిపోతారో అలాగే ఇక్కడకూడా వంతెన పైకి లేచిన సమయంలో బ్రిడ్జ్‌కు ఇరువైపులా ఉన్న వాహనాలు నిలిచిపోతుంటాయి. సెప్టెంబర్ 28న నదిలో బోటు వెళ్తుండగా వంతెన ఒక్కసారిగా పైకి లేచింది. పడవ వెళ్లిపోయిందికానీ వంతెనమాత్రం కిందకు రాలేదు. ఆ బ్రిడ్జ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. మధ్యాహ్నం సమయంలో ఓ పడవ నదిలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రిడ్జ్ పైకి లేచింది. ఆ తర్వాత యథాస్థానానికి రాలేకపోయింది. దీంతో వంతెనపై నుంచి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో లండన్ వీధుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ టవర్ వంతెనను 1894లో నిర్మించారు. ఇది గ్రేటర్ లండన్ బారోగ్స్ ఆఫ్ టవర్ హామ్లెట్స్, లండన్‌లోని సౌత్‌వార్క్ మధ్య థేమ్స్ నదిపై నిర్మించారు. ఈ బ్రిడ్జి 76 మీటర్ల వెడల్పు, 240 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన థేమ్స్ నదికి 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. రోడ్డు, నదీ ప్రయాణానికి వీలుగా నిర్మించిన ఈ వంతెన పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..