Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మంత్రి రోజా ను దూషించిన కేసులో బండారు ను పోలీసులు ఏం చేశారో తెలుసా?

Visakhapatnam: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. దీనిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పందిస్తూ నారా, నందమూరి కుటుంబ సభ్యులపై అనుచితంగా మాట్లాడారంటూ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు టిడిపి మాజీ మంత్రి బండారు..

Andhra Pradesh: మంత్రి రోజా ను దూషించిన కేసులో బండారు ను పోలీసులు ఏం చేశారో తెలుసా?
High Tension In Visakhapatn
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Oct 02, 2023 | 8:02 AM

విశాఖపట్నం, అక్టోబర్02; విశాఖ జిల్లా పరవాడ వెన్నెల పాలెం లో గత అర్థరాత్రి నుంచి హైటెన్షన్‌ నెలకుంది. కారణం ఆ గ్రామంలో నివసిస్తున్న టీడీపీ మాజీ మంత్రి బండారు సత్య నారాయణ మూర్తి ఇంటి వద్దకు పదుల సంఖ్యలో పోలీసులు చేరుకోవడం. ఆ పోలీసులు కూడా గుంటూరు నగరం పాలెం పోలీసులు కాగా వారికి సపోర్ట్ గా పరవాడ పోలీసులు ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో అక్కడకు చేరుకున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి ఆ సమయానికి నిద్రకు ఉపక్రమించారనీ, ఇప్పుడు నిద్ర లేపెందుకు అంగీకరించమని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు బండారు ఇంటివద్దే అర్దరాత్రి నుంచి వేచి ఉండడం తో టెన్షన్ వాతావరణం నెలకొంది. అదే ఉద్రిక్తత కొనసాగింది. బండారు నిద్ర లేచేదాకా వేచి ఉండాలని నిర్ణయించుకున్న పోలీసులు అక్కడే వేచి ఉన్నారు.

ఈ సమాచారం తెలిసి బండారు ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు పోలీస్ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసేందుకు అవకాశం లేదని, అడ్డుకుంటామని టీడీపీ శ్రేణులు చెబుతుండటం తో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

బండారు సత్యనారాయణ మూర్తి టూరిజం శాఖా మంత్రి బండారు సత్య నారాయణ మూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ ఉంది. దీంతో గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదు అయింది. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే నమోదైన కేసులు అన్ని 7 సంవత్సరాల లోపు శిక్షకు చెందిన సెక్షన్ లే కాబట్టి నోటీస్ ఇచ్చి వెళ్తారా, అరెస్ట్ చేసి తీసుకెళ్తారా అన్న సందిగ్ధత  నెలకొంది. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ తర్వాత నారా భువనేశ్వరి బ్రహ్మణి లు రాజమండ్రి వచ్చి అక్కడ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని, అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. దీనిపై టూరిజం శాఖ మంత్రి రోజా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పందిస్తూ నారా, నందమూరి కుటుంబ సభ్యులపై అనుచితంగా మాట్లాడారంటూ ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. ఆ సమయంలో రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె వ్యక్తిగత జీవితం పై తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి

దీంతో వైసీపీ నుంచి వ్యతిరేక వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో వైసిపి నేత ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఆ కేసులో విచారణ చేసేందుకు విశాఖ చేరుకుని బండారి ఇంటికి వెళ్లారు గుంటూరు నగరం పాలెం పోలీసులు. అయితే ఆ సమయానికైనా ఆయన నిద్రకు ఉపక్రమించడం, సీనియర్ సిటిజన్ కావడంతో నిద్రలేచేదాక వేచి ఉండే ప్రయత్నం చేశారు నగరం పాలెం పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..