AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్స్‌ గమనించారా.? వాటి ఉపయోగం ఏంటో తెలుసా?

ముఖ్యంగా యూత్‌ను అట్రాక్ట్ చేస్తూ, ప్రైవేసీకి పెద్ద పీటవేస్తూ కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్‌. ఈ క్రమంలోనే ఈ ఏడాది వాట్సాప్‌ కొన్ని సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. అయితే వాట్సాప్‌ తీసుకొచ్చిన కొన్ని ఫీచర్స్‌ చాలా మందికి తెలియదు. ఇంతకీ వాట్సాప్‌ ఈ ఏడాది పరిచయం చేసిన కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

WhatsApp: వాట్సాప్‌లో వచ్చిన ఈ కొత్త ఫీచర్స్‌ గమనించారా.? వాటి ఉపయోగం ఏంటో తెలుసా?
Whatsapp New Features
Narender Vaitla
|

Updated on: Oct 22, 2023 | 7:40 PM

Share

యూజర్లు చేజారిపోకుండా, మార్కెట్లో నెలకొన్ని పోటీని తట్టుకునే క్రమంలో వాట్సాప్‌ నిత్యం కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌ నిలవడానికి ఈ ఫీచర్లే కారణం. ముఖ్యంగా యూత్‌ను అట్రాక్ట్ చేస్తూ, ప్రైవేసీకి పెద్ద పీటవేస్తూ కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్‌. ఈ క్రమంలోనే ఈ ఏడాది వాట్సాప్‌ కొన్ని సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసింది. అయితే వాట్సాప్‌ తీసుకొచ్చిన కొన్ని ఫీచర్స్‌ చాలా మందికి తెలియదు. ఇంతకీ వాట్సాప్‌ ఈ ఏడాది పరిచయం చేసిన కొత్త ఫీచర్లు ఏంటి.? వాటి ఉపయోగాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

* ఈ ఏడాది వాట్సాప్‌ తీసుకొచ్చిన బెస్ట్‌ ఫీచర్స్‌లో వాయిన్‌ నోట్స్‌ ఒకటి. వాట్సాప్‌ స్టేటస్‌లో కేవలం వీడియోలు, ఫొటోలను పోస్ట్‌ చేసే అవకాశం మాత్రమే ఉండేది. అయితే వాట్సాప్‌ తీసుకొచ్చి వాయిస్‌ నోట్‌ ఫీచర్‌తో వాయిస్‌ నోట్‌లను స్టేటస్‌గా సెట్ చేసుకునే అవకాశం కల్పించారు. 30 సెకన్ల వాయిస్‌ నోట్‌ని స్టేటస్‌లో పోస్ట్ చేసుకునే అవకాశం వాట్సాప్‌ కల్పించింది.

* వాట్సాప్‌ తీసుకొచ్చిన మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ ఎడిట్‌ మెసేజ్‌. ఈ ఏడాది పరిచయం చేసిన ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో మెసేజ్‌లో జరిగే పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. మొన్నటి వరకు ఏదైనా తప్పుడు మెసేజ్‌ పంపిస్తే డిలీట్‌ ఫర్‌ ఆల్‌ చేసిన తర్వాత మళ్లీ కొత్తగా మెసేజ్‌ పంపేవారు. కానీ ఈ ఎడిట్‌ మెసేజ్‌తో మీ ఫోన్‌లో మెసేజ్‌ను ఎడిట్‌ చేస్తే అవతలి వ్యక్తికి సెండ్ అయిన మెసేజ్‌ కూడా ఎడిట్ అవుతుంది.

* ఇక ప్రైవసీకి పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌ ఈ ఏడాది తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్‌ చాట్‌ లాక్‌. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తమకు నచ్చిన చాట్‌ను లాక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో మీ పర్సనల్ చాట్‌ను ఇతరులు కూడా చూడకుండా చేసుకోవచ్చు.

* అన్‌నోన్‌ నెంబర్స్‌ నుంచి వచ్చే వాట్సాప్‌ కాల్స్‌తో డిస్ట్రబ్‌ కాకుండా సైలెంట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్‌. ఈ ఫీచర్‌ సహాయంతో మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకోని నెంబర్ల నుంచి కాల్స్‌ వస్తే ఆటోమెటిక్‌గా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

* ఇక ఈ ఏడాది వాట్సాప్‌ తీసుకొచ్చిన మరో కొత్త ఫీచర్‌ ఛానెల్స్‌. ప్రత్యర్థి సోషల్‌ మీడియా సైట్స్‌ నుంచి నెలకొన్ని పోటీని తట్టుకునే క్రమంలో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో యూజర్లు సెలబ్రిటీలు, సంస్థలు, మీడియా సంస్థలకు చెందిన ఛానెల్స్‌తో కనెక్ట్‌ అవ్వొచ్చు.

* వీడియో కాల్స్‌కు పెరుగుతోన్న ఆదరణ నేపథ్యంలో వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వీడియో కాల్స్‌ చేసే సమయంలో స్క్రీన్‌ షేరింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో వీడియో కాల్‌ మాట్లాడే సమయంలో మొబైల్‌ లేదా డెస్క్‌టాప్‌ స్క్రీన్‌ను షేర్‌ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..