AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon: మరో అద్భుతానికి శ్రీకారం చుడుతోన్న అమెజాన్‌.. త్వరలోనే భారత్‌లో ఆ సేవలు కూడా..

శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్ సేవలను అందించేందుకు అమెజాన్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రాజెక్ట్‌ కైపర్‌ను ప్రారభించేందుకు అమెజాన్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఫాస్ట్ ఇంటర్‌నెట్ సేవల కోసం లోయర్‌ ఎర్త్‌ ఆర్టిట్‌లో మొత్తం 3236 ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది...

Amazon: మరో అద్భుతానికి శ్రీకారం చుడుతోన్న అమెజాన్‌.. త్వరలోనే భారత్‌లో ఆ సేవలు కూడా..
Amazon
Narender Vaitla
|

Updated on: Oct 12, 2023 | 3:28 PM

Share

అమెజాన్‌.. ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఈ కామర్స్‌. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్‌ సైట్స్‌గా పేరుగాంచిన అమెజాన్‌ తన సేవలను విస్తరిస్తూ పోతోంది. ఇప్పటికే ఎంటర్‌టైన్‌మెంట్ సహా పలు ఇతర రంగాలకు తన సేవలను విస్తరించిన అమెజాన్‌ తాజాగా మరో రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ త్వరలోనే భారత్‌లో ఇంటర్‌నెట్ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది.

శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్ సేవలను అందించేందుకు అమెజాన్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రాజెక్ట్‌ కైపర్‌ను ప్రారభించేందుకు అమెజాన్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఫాస్ట్ ఇంటర్‌నెట్ సేవల కోసం లోయర్‌ ఎర్త్‌ ఆర్టిట్‌లో మొత్తం 3236 ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. 2026 నాటికి సగానికిపైగా ఉపగ్రాహాలను నింగిలోకి పంపాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.

అమెజాన్‌ ప్రస్తుతం ఈకామర్స్‌తో పాటు ప్రైమ్‌ వీడియోతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి కూడా విస్తరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో శాటిలైట్‌ సేవలను విస్తరించేందుకు రెగ్యులేటరీ ఆమోదం పొందేందుకు అమెజాన్‌ ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌కి దరఖాస్తు చేసుకుంది. తక్కువ ధరకే వన్‌ జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలు అందించే అవకాశాలున్నాయి.

దేశవ్యాప్తంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు అమెజాన్‌ సన్నాహాలు చేస్తోంది. అమెజాన్‌ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌తో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ సేవలను మరింత విస్తరించేందుకు ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇది ఈకామర్స్‌ సైట్‌తో పాటు ప్రైమ్‌ సేవల విస్తరణకు ఉపయోగపడుతుందని అమెజాన్‌ భావిస్తోంది. వన్‌వెబ్‌, జియో శాటిలైట్స్‌కు ప్రభుత్వం జీఎంపీసీఎస్‌ అనుమతులు మంజూరు చేసింది.

ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ స్టార్‌లింక్‌ శాటిలైట్ ఆధారిత ఇంటర్‌నెట్ సేవలను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఈ సంస్థ భారత్‌లో ఇంటర్‌నెట్ సేవలను అందించడానికి దరఖాస్తు చేసుకుంది. స్టార్‌లింక్‌ ఇప్పటికే ఐదు వేలకుపైగా ఉప గ్రహాలను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టింది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..