అమెజాన్ సేల్‌తో మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చుకోండి.. రూ. 2వేలలోపు సూపర్ గ్యాడ్జెట్స్..
అక్టోబర్ 8వ తేదీన ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు గృహోపకరణాల వరకు ఏకంగా 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2 వేలలోపు ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ గ్యాడ్జెట్స్ ఏంటి.?

ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకుగాను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8వ తేదీన ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా పలు రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొదలు గృహోపకరణాల వరకు ఏకంగా 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెజాన్ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ తక్కువ ధరకు లభిస్తున్నాయి. డిస్కౌంట్‌లో భాగంగా రూ. 2 వేలలోపు ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ గ్యాడ్జెట్స్ ఏంటి.? వాటి ఉపయోగం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
HomeMate WiFi Smart Door: తక్కువ ధరకు అమెజాన్‌లో లభిస్తోన్న స్మార్ట్ గ్యాడ్జెట్స్‌లో హోమ్‌మేట్ వైఫై స్మార్ట్ డోర్ గ్యాడ్జెట్ ఒకటి. దీని అసలు ధర రూ. 3999కాగా సేల్ భాగంగా రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ గ్యాడ్జెట్ ఉపయోగం ఏంటంటే. డోర్ లేదా కబౌర్డ్‌లకు ఈ గ్యాడ్జెట్‌ను బిగించుకునే సదుపాయం ఉంటుంది. వైఫైతో కనెక్ట్ అయ్యే ఈ గ్యాడ్జెట్ ద్వారా తలుపులు కానీ కబోర్డ్‌లు కానీ ఎప్పుడు ఓపెన్ చేసినా వెంటనే మీ స్మార్ట్ ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. ప్రొడక్ట్‌పై వన్ ఇయర్ వారంటీ సైతం అందిస్తున్నారు.
Zebronics Zeb Smart Cam: అమెజాన్ సేల్‌లో రూ. 2 వేలలోపు అందుబాటులో లభిస్తున్న మరో బెస్ట్ స్మార్ట్ గ్యాడ్జెట్ జిబ్రోనిక్ జెబ్ స్మార్ట్ క్యామ్ ఒకటి. ఈ సీక్రెట్ కెమెరా అసలు ధర రూ. 2,499కాగా 52 శాతం డిస్కౌంట్‌తో రూ. 1,198కే సొంతం చేసుకోవచ్చు. ఈ కెమెరా ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. వైఫ్ కెమెరా, రిమోట్ మానిటరింగ్, అడ్వాన్స్‌డ్ మోషన్ డిటెక్షన్, డే/నైట్ మోడ్, లైవ్ స్ట్రీమింగ్, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్, 2 వే ఆడియోతో రూపొందించిన ఈ కెమెరా ఆండ్రాయిడ్, ఐఫోన్ స్మార్ట్ ఫోన్‌లకు సపోర్ట్ చేస్తుంది. 2 మెగాపిక్సెల్ ఈ కెమెరా సొంతం. ఇక ఇందులో అలెక్సా, ఓకే గూగుల్ సపోర్ట్ అందిస్తున్నారు.
Hoteon Automatic Water Dispenser: ప్రస్తుతం ఇంట్లో వాటర్ బబుల్స్ వినియోగం పెరిగింది. అయితే బబుల్‌లో నుంచి నీటిని ప్రతీసారి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యకు చెక్ పెడుతుంది ఈ స్మార్ట్ గ్యాడ్జెట్. వాటర్ బబుల్ నుంచి సులభంగా నీటిని తీసుకునేందుకు ఈ గ్యాడ్జెట్ ఉపయోగపడుతుంది. ఇందులో 1200 ఎమ్‌ఏహెచ్ లిథియం బ్యాటరీని అందించారు. ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 8 నుంచి 10 బాటిళ్ల వరకు పని చేస్తుంది. చిన్న బటన్ నొక్కడం ద్వారా సులభంగా నీరు బబుల్‌లో నుంచి బయటకు వస్తాయి. ఈ గ్యాడ్జెట్ అసలు ధర రూ. 1999కాగా డిస్కౌంట్‌లో రూ. 1059కే సొంతం చేసుకోవచ్చు.
TP-Link AC750 Wifi Range Extender: వైఫై సిగ్నల్‌ను బూస్ట్ చేసేందుకు ఉపయోగించే ఈ గ్యాడ్జ్ అసలు ధర రూ. 5,499 కాగా సేల్‌లో భాగంగా ఏకంగా 69 శాతం డిస్కౌంట్‌లో రూ. 1699కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. దీని ద్వారా 433 మెగాబైట్స్ పర్ సెకండ్ వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. డ్యూయల్ బాండ్ ఈ ప్రొడక్ట్ స్పెషల్ ఫీచర్‌గా చెప్పొచ్చు.
Wipro 9W B22D WiFi LED Smart Bulb: అమెజాన్ సేల్‌లో కేవలం రూ. 549కే అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ గ్యాడ్జెట్స్‌లో ఇదీ ఒకటి. విప్రో కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ బల్బ్‌ను ఏడాది వారంటీతో అందిస్తున్నారు. ఈ స్మార్ట్ బల్బ్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. విప్రో నెక్ట్స్ స్మార్ట్ యాప్‌తో వాయిస్ కమాండ్‌ల ఆధారంగా లైట్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ బల్బ్ అసలు ధర రూ. 2,099 కాగా ఏకంగా 74 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..