AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Space Tour: స్పేస్ టూర్లు రెడీ! బుకింగ్స్ కూడా మొదయ్యాయి! టికెట్ ధర ఎంతంటే..

భూమి మీద టూర్లు వేయడం కాదు, ఏకంగా అంతరిక్షంలోకి కూడా టూర్ వేయొచ్చు. ఇప్పటికే చాలామంది కుబేరులు స్పెషల్ స్పేస్ క్రాఫ్ట్స్ లో స్పేస్ టూర్లు వేసి వచ్చారు. ఇక మిగిలింది మన వంతే.. మీ దగ్గర డబ్బు ఉంటే మీరు కూడా స్పేస్ లోకి టూర్ వేసి రావొచ్చు. ఈ స్పేస్ టూర్ల గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Space Tour: స్పేస్ టూర్లు రెడీ!  బుకింగ్స్ కూడా మొదయ్యాయి! టికెట్ ధర ఎంతంటే..
Space Tour
Nikhil
|

Updated on: Sep 21, 2025 | 12:53 PM

Share

స్పేస్ టూర్ అంటే.. భూమి వాతావరణం దాటి  సబ్‌ ఆర్బిటల్‌ వరకూ రాకెట్ లేదా స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షం దరిదాపుల్లోకి వెళ్తారు. అంటే గుండ్రంగా ఉండే భూమిని పై నుంచి చూడొచ్చన్న మాట. ఈ స్పేస్ టూర్లకై ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి.  సాధారణ ప్రజలు కూడా అంతరిక్షంలోకి అడుగుపెట్టే విధంగా రకరకాల స్పేస్ టూర్లు రెడీ అవుతున్నాయి. దీనికోసమని స్పేస్ క్రాఫ్ట్ లు కూడా రెడీ చేస్తున్నారు.

వర్జిన్ గెలాక్టిక్

వర్జిన్ గెలాక్టిక్‌ అనే సంస్థ  ఇప్పటకే స్పేస్ టూర్ల కోసం బుకింగ్స్‌ మొదలుపెట్టింది. టికెట్‌ కాస్ట్‌ 2లక్షల డాలర్లకు పైనే.  ఇప్పటికే ఈ స్పేస్ టూర్ కోసం 60దేశాల నుంచి 600 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నారు. ఇందులో టామ్‌ హాంక్స్‌, టామ్‌ క్రూస్‌ లాంటి హాలీవుడ్ యాక్టర్లు,  పాప్‌ సింగర్స్‌ లేడీ గాగా, జస్టిన్ బీబర్‌ లాంటి వాళ్లంతా ఉన్నారు. అంతే కాదు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కూడా స్పేస్ టూర్ కోసం టికెట్ బుక్ చేసుకున్నారట. అయితే ఈ ఆరొందల మందిలో కేరళకు చెందిన ఒక బిలియనీర్ కూడా టికెట్ బుక్ చేసుకున్నాడు.

డీప్ బ్లూ ఏరోస్పేస్

తాజాగా చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ కూడా స్పేస్‌ టూరిజంను స్టార్ట్ చేసింది. 2027లో చేపట్టనున్న టూర్ కి ఇప్పట్నుంచే బుకింగ్స్ మొదలయ్యాయి. చైనాకు చెందిన డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ అనే స్టార్టప్‌ 2027లో అంతరిక్ష యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనికోసమని రెండు సీట్ల రాకెట్ ను రెడీ చేస్తుంది. ఈ టికెట్ ధర 1.5 మిలియన్‌ యువాన్లు.. అంటే సుమారు రూ.1.77 కోట్లు.

ఇస్రో స్పేస్ టూర్

ఇకపోతే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కూడా..  2030 నాటికి స్పేస్ టూర్లు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. అంతరిక్షం అంచు వద్ద 15 నిమిషాలు గడపేలా ఈ టూర్ ప్లాన్ చేస్తున్నారట. దీనికోసమై ఆర్ఎల్‌వీటీడీ(RLV-TD) అనే లాంచ్ వెహికల్ ను ఉపయోగిస్తారట. అయితే టికెట్ కాస్ట్ మాత్రం సుమారు రూ.6 కోట్లు ఉంటుందని ఇస్రో చెప్తోంది. ఇదంతా చూస్తుంటే ఫ్యూచర్ లో స్పేస్ టూరిజం ఏ రేంజ్ లో పాపులర్ అవ్వబోతుందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రూ.1.3 కోట్లతో ఆరు నెలల ఉద్యోగ ఆఫర్‌..! కానీ, ట్విస్ట్‌ ఏంటంటే..
రూ.1.3 కోట్లతో ఆరు నెలల ఉద్యోగ ఆఫర్‌..! కానీ, ట్విస్ట్‌ ఏంటంటే..
ఆ బ్యూటీఫుల్ నేపాలీ క్రికెటర్ ప్రేమలో తిలక్ వర్మ ?
ఆ బ్యూటీఫుల్ నేపాలీ క్రికెటర్ ప్రేమలో తిలక్ వర్మ ?
ప్రమాదంలో స్కై డైవర్‌ విమానం తోక‌ను చుట్టిన పారాచూట్‌ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్‌ విమానం తోక‌ను చుట్టిన పారాచూట్‌ వీడియో
అసలు భూమిపై బంగారం ఎలా తయారవుతుందో మీకు తెలుసా?
అసలు భూమిపై బంగారం ఎలా తయారవుతుందో మీకు తెలుసా?
ఈశాన్యంలో బరువులు ఎందుకు పెట్టకూడదంటారు..?
ఈశాన్యంలో బరువులు ఎందుకు పెట్టకూడదంటారు..?
చేపలు మీ ఆహారంలో ఉంటే.. తిరుగేలేదు.. అనారోగ్యం పటాపంచలు..
చేపలు మీ ఆహారంలో ఉంటే.. తిరుగేలేదు.. అనారోగ్యం పటాపంచలు..
బ్యాంకుల్లో కీలక మార్పులు.. ఇక అక్కడికి వెళ్లాల్సిందే. .
బ్యాంకుల్లో కీలక మార్పులు.. ఇక అక్కడికి వెళ్లాల్సిందే. .
48 బంతుల్లోనే సెంచరీ.. సెలక్టర్లకు బ్యాట్‌తో జవాబిచ్చిన యశస్వి
48 బంతుల్లోనే సెంచరీ.. సెలక్టర్లకు బ్యాట్‌తో జవాబిచ్చిన యశస్వి
చలికాలంలో ఫ్రిజ్‌లో వీటిని అస్సలు పెట్టొద్దు.. పెడితే ఈ సమస్యలు..
చలికాలంలో ఫ్రిజ్‌లో వీటిని అస్సలు పెట్టొద్దు.. పెడితే ఈ సమస్యలు..
శ్రీకాంత్ కొడుకుతో ఉన్నదెవరో గుర్తుపట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరో
శ్రీకాంత్ కొడుకుతో ఉన్నదెవరో గుర్తుపట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరో