Netflix Scam: నెట్‌ప్లిక్స్ వినియోగదారులకు అలెర్ట్.. ఇలా చేశారో? మీ బ్యాంకు ఖాతా ఖాళీ..

నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు నకిలీ ఈమెయిల్స్ ద్వారా చెల్లింపు వివరాలను దొంగిలిస్తున్నారని చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత రోజుల్లో బ్రాండ్ ఫిషింగ్ దాడి సర్వసాధారణం. మైక్రోసాఫ్ట్, గూగుల్, లింక్డ్‌ఇన్, అలాగే వాల్‌మార్ట్ వంటి కంపెనీలు కూడా గతంలో ఇలాంటి దాడులకు గురయ్యాయి.

Netflix Scam: నెట్‌ప్లిక్స్ వినియోగదారులకు అలెర్ట్.. ఇలా చేశారో? మీ బ్యాంకు ఖాతా ఖాళీ..
Follow us
Srinu

|

Updated on: Apr 25, 2023 | 3:45 PM

ప్రస్తుత రోజుల్లో బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రజలు కూడా తమ సొమ్మును బ్యాంకుల్లోనే దాచుకుంటున్నారు. గతంలో దారి దోపిడి దొంగలు ఉన్నట్లు ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ ఖాతా నుంచే సొమ్ము కాజేసే దొంగలు తయారయ్యారు. సైబర్ క్రైమ్ పోలీససులు తెలిపిన వివరాల ప్రకారం మోసగాళ్లు తాజాగా నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు నకిలీ ఈమెయిల్స్ ద్వారా చెల్లింపు వివరాలను దొంగిలిస్తున్నారని చెక్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత రోజుల్లో బ్రాండ్ ఫిషింగ్ దాడి సర్వసాధారణం. మైక్రోసాఫ్ట్, గూగుల్, లింక్డ్‌ఇన్, అలాగే వాల్‌మార్ట్ వంటి కంపెనీలు కూడా గతంలో ఇలాంటి దాడులకు గురయ్యాయి. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఖాతా హోల్డ్‌లో ఉందని అప్‌డేట్ చేయాలని ఆ ఈ-మెయిల్లో మోసగాళ్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా బిల్లింగ్ సైకిల్ మీ చెల్లింపు వ్యాలిడేట్ చేయలేకపోయిందని కాబట్టి ఖాతాను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆ ఈ-మెయిల్‌లో ఉంటుందని వినియోగదారులు చెబుతున్నారు. అలాగే ఈ-మెయిల్లో సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించడానికి లింక్‌ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే చెల్లింపు వివరాలను నమోదు చేయమని సూచిస్తుంది. మీరు ఇక్కడ చెల్లింపు వివరాలు నమోదు చేస్తే మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ చేసే మీ సొమ్ము తస్కరించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఫేక్ ఈ-మెయిల్స్ రెస్పాండ్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. 

మోసం చేస్తున్నారిలా

మోసగాళ్లు ఒకే రకమైన డొమైన్ పేరు లేదా యూఆర్ఎల్, నిజమైన సైట్‌ను పోలి ఉండే వెబ్ పేజీ డిజైన్‌ను ఉపయోగించడం ద్వారా ప్రసిద్ధ బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను అనుకరించడం ద్వారా వినియోగదారులను మోసగిస్తున్నారు. ఫేక్ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్ ఆ తర్వాత టార్గెట్ చేసిన వ్యక్తులకు ఈ-మెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపుతున్నారు. వినియోగదారులు దానిపై క్లిక్ చేసిన తర్వాత, వారు వెబ్ పేజీకి వెళ్తారు. మోసపూరిత మొబైల్ యాప్ నుంచి కూడా వినియోగదారులను దారి మళ్లించే అవకాశాలు కూడా ఉన్నాయి.  అక్కడ వినియోగదారుల వివరాలతో పాటు చెల్లింపు వివరాలను స్కామర్లు అడుగుతున్నారు. దీంతో వారికి ఆ వివరాలు మొత్తం చేరి సొమ్మును దొంగలించే అవకాశం ఉంది. అలాగే ఒక్కోసారి చెల్లింపు కోసం ఓటీపీ ఆధారిత ప్రామాణికతను అడిగే అవకాశం కూడా ఉంది.

ఆన్‌లైన్ మోసాల నుంచి జాగ్రత్తలు

వినియోగదారులు వారు ఉపయోగిస్తున్న సేవల నుంచి వారు స్వీకరించే ఈ-మెయిల్స్‌పై జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఖాతా సస్పెన్షన్, దాని సబ్‌స్క్రిప్షన్ పునరుద్ధరణ గురించి మీకు ఈ-మెయిల్ వస్తే మీరు ముందుగా నెట్‌ఫ్లిక్స్ యాప్‌ని తనిఖీ చేయాలి. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పొందే అన్ని టెక్స్ట్ సందేశాలు లేదా ఈ-మెయిల్స్‌ను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. సస్పెన్షన్ లేదా మరేదైనా ఈ-మెయిల్, కాల్ లేదా ఎస్ఎంఎస్‌ని విశ్వసించే ముందు వినియోగదారులు ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..