AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: మీ మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమో తెలుసా?

Tech Tips: ఫోన్‌ని ఒకసారి ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్తు ఖర్చు అవుతుంది? ఫోన్ ఛార్జింగ్‌కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ప్రతిరోజూ మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే మొత్తం నెల లేదా సంవత్సరానికి మీ విద్యుత్ బిల్లు ఎంత అనేది తెలుసుకుందాం..

Tech Tips: మీ మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమో తెలుసా?
Subhash Goud
|

Updated on: Jan 07, 2025 | 5:30 PM

Share

స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా అనేక రోజువారీ పనులు జరుగుతున్నాయి. ఫోన్ లేకుండా జీవితం అసంపూర్ణం ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈ ఫోన్ పనిచేయాలంటే బ్యాటరీని ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్ చేయడానికి విద్యుత్ అవసరం. స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జ్ చేయకపోతే అది పనిచేయడం ఆగిపోతుంది. మొబైల్‌ ఛార్జింగ్‌ కావడానికి బ్యాటరీ సామర్థ్యం బట్టి ఉంటుంది. అయితే ఒక్కసారి స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

ఫోన్‌ని ఒకసారి ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్తు ఖర్చు అవుతుంది? ఫోన్ ఛార్జింగ్‌కి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ప్రతిరోజూ మీ ఫోన్‌ను ఛార్జ్ చేస్తే మొత్తం నెల లేదా సంవత్సరానికి మీ విద్యుత్ బిల్లు ఎంత అనేది తెలుసుకుందాం.

మొబైల్ ఛార్జింగ్ ఎంత విద్యుత్తును ఉపయోగిస్తుంది?

ఇవి కూడా చదవండి

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎంత అనేదాన్ని బట్టి ఉంటుంది? ఛార్జింగ్‌కు ఎంత విద్యుత్తు ఖర్చు అవుతుందో తెలుసుకోవాలంటే, మీరు ఫోన్‌ను ఎంత తరచుగా, ఎంతసేపు ఛార్జ్ చేస్తున్నారో గుర్తుంచుకోవాలి. సగటున ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌కు రోజుకు 3 గంటలు ఛార్జ్ చేస్తారు. ఫాస్ట్ ఛార్జర్ నుంచి చార్జింగ్ పెట్టే వారు తక్కువ సమయంలో అంతే విద్యుత్తును వినియోగిస్తారు. ఇంత సేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం వల్ల 0.15 KWH విద్యుత్ ఖర్చవుతుంది. అంతేకాకుండా అధిక mAh బ్యాటరీ ఉన్న ఫోన్ ఎక్కువ పవర్‌ను వినియోగిస్తుంది. ఇది 0.115 KWH వరకు ఉంటుంది.

ఉదాహరణకు.. ఐఫోన్ అడాప్టర్ 5W. మీరు దానిని గంటకు ఛార్జ్ చేస్తే అది 0.005KWh విద్యుత్తును వినియోగిస్తుంది. అదే 3 గంటల పాటు ఉపయోగించడం వల్ల 0.015 KWH విద్యుత్ ఖర్చవుతుంది. యూనిట్ల వారీగా ఏడాదికి 5 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుంది. అంటే ఏడాదిలో కేవలం ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం కేవలం 5 యూనిట్ల విద్యుత్‌ మాత్రమే ఖర్చు అవుతుంది. బ్యాటరీలు ఎంత శక్తివంతంగా ఉంటే అంత ఎక్కువ సేపు ఫోన్ ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కసారిగా విద్యుత్తు ఖర్చవుతోంది. 3000 నుండి 5000 MAH బ్యాటరీ ఉన్న ఫోన్ అయితే సంవత్సరానికి 4-6 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది.

మీ రాష్ట్రంలోని యూనిట్ విద్యుత్ రేటు నుండి ఒక సంవత్సరంలో ఫోన్ ఛార్జీలు ఎంత ఖర్చవుతాయని మీరు అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, ఒక యూనిట్ విద్యుత్తు రూ.8 వసూలు చేస్తే, మీరు మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి సంవత్సరానికి రూ.40 ఖర్చు చేస్తారు. నెల మొత్తం లెక్కిస్తే ఈ ఖర్చు దాదాపు 3.5 రూపాయలు అవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..