Vehicle Tips: వాహనంలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తున్నారా? బంకుల్లో మీరు చేసే పెద్ద తప్పు ఇదే!

Vehicle Tips: కారు ఫ్యూయల్ ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్ గా సెన్సార్ ద్వారా ఫ్యూయల్ రావడం ఆగిపోతుంది. కార్ల కంపెనీ మ్యానుఫ్యాక్చర్ లు కావాలనే ఫ్యూయల్ ట్యాంకులు కొంత స్పేస్ ఉండేలా డిజైన్ చేస్తారు. ఫుల్ ట్యాంకు తర్వాత జర్నీ మొదలుపెట్టగానే..

Vehicle Tips: వాహనంలో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తున్నారా? బంకుల్లో మీరు చేసే పెద్ద తప్పు ఇదే!
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Subhash Goud

Updated on: Jan 07, 2025 | 6:54 PM

కార్లలో పెట్రోల్, డీజిల్ కొట్టించేటప్పుడు అందరికీ ఉండే కామన్ అలవాటు. రెగ్యులర్ గా కార్ వాడే వాళ్లు ఫ్యూయల్ ఎంప్టీ సింబల్ రాగానే ఫుల్ ట్యాంక్ కొట్టిస్తుంటారు.. అక్కడే తెలియకుండానే చిన్న పొరపాటు కూడా చేస్తున్నాం. పెట్రోల్ బంక్‌లో ఫ్యూయల్ కొట్టించే సమయంలో ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత బంక్ వాడు అడిగే కామన్ ప్రశ్న. సార్.. ఆపమంటారా!! ఇంకా కొట్టమంటారా?? అప్పుడు ఇంకా కామన్ గా మనం చెప్పే ఆన్సర్ ఎంత పడితే అంత కొట్టు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? అక్కడే సైంటిఫిక్ రీసన్ ఉంది. మీరు ఎప్పుడైనా కార్ సర్వీస్ కి ఇచ్చినప్పుడు అక్కడున్న టెక్నీషియన్ ని ఒకసారి అడిగి చూడండి డీటెయిల్ గా మీకు వివరిస్తారు.

కారు ఫ్యూయల్ ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్ గా సెన్సార్ ద్వారా ఫ్యూయల్ రావడం ఆగిపోతుంది. కార్ల కంపెనీ మ్యానుఫ్యాక్చర్ లు కావాలనే ఫ్యూయల్ ట్యాంకులు కొంత స్పేస్ ఉండేలా డిజైన్ చేస్తారు. ఫుల్ ట్యాంకు తర్వాత జర్నీ మొదలుపెట్టగానే కారు కుదుపులకి డీజిల్ లేదా పెట్రోల్ కొంత విస్తరిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ట్యాంక్ లో పోస్తున్నప్పుడు.. ఒక ఆవిరి లాంటి పదార్థం పైకి వెళ్తూ ఉంటుంది. కార్ ఫ్యూయల్ ట్యాంక్ లో కూడా పెట్రోల్ లేదా డీజిల్ నుంచి అది కుదుపులకు ఉత్పత్తి అవుతుంది. ఆ ప్రెషర్ ని తట్టుకోవడానికి ఫుల్ ట్యాంక్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఉంచుతాయి కార్ల కంపెనీలు.

కానీ మనం ఆ స్పేస్ ని కూడా ఫీల్ తో ఫిల్ అప్ చేయడం ద్వారా పెట్రోల్ ట్యాంక్ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. కొన్నిసార్లు ఫ్యూయల్ ట్యాంక్ లీకులు పడడం, ఫ్యూయల్ పైపులు లీక్ అవడం, ఇంజన్‌లో కూడా రిపేర్లు రావడం జరుగుతాయి. ఎక్కడైనా కారు చిన్న ప్రమాదానికి గురైన ఈ ఒత్తిడితో పెట్రోల్ ట్యాంక్ పేలిపోతుంది. కారు జీవితకాలం ఇలా పూర్తిగా ఫ్యూయల్ నింపడం ద్వారా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది బైకులకు కూడా వర్తిస్తుంది. అయితే కారులకు జరిగినంత ప్రమాదం జరగకపోయినా.. బైక్ ఇంజన్ పాడయ్యే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందంటున్నారు టెక్‌ నిపుణులు. సో ఇంకొకసారి పెట్రోల్ బంక్‌లో ఈ ఫుల్ ట్యాంక్ మిస్టేక్ చేయకండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి