Dasara OTT: మే కాదు.. ఈనెలలోనే ఓటీటీలోకి నాని బ్లాక్ బస్టర్‌ సినిమా.. దసరా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

పాన్‌ ఇండియా లెవెల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన దసరా ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉంది. దసరా సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

Dasara OTT: మే కాదు.. ఈనెలలోనే ఓటీటీలోకి నాని బ్లాక్ బస్టర్‌ సినిమా.. దసరా స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Dasara Ott
Follow us
Basha Shek

|

Updated on: Apr 20, 2023 | 8:48 AM

న్యాచురల్ స్టార్‌ నాని, మహానటి కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం దసరా. సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించాడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో ఇంటర్వెల్‌ బ్యాంగ్, క్లైమాక్స్‌ తెగ నచ్చాయని రివ్యూలు వచ్చాయి. మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోలు దసరా సినిమాను మెచ్చుకున్నారు. పాన్‌ ఇండియా లెవెల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన దసరా ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడే అవకాశం ఉంది. నాని సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. దాదాపు రూ. 22 కోట్లకు దసరా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

కాగా ఇటీవల మే 30 నుంచి దసరా స్ట్రీమింగ్‌ కానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో వస్తోన్న లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఏప్రిల్‌ 27 నుంచి నాని సినిమా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అయితే హిందీ వెర్షన్ హక్కులను మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించింది. ఇందులోని చమ్కీల అంగిలేసి సాంగ్ చార్ట్‌ బస్టర్‌ గా నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలోని డిలిటెడ్ సీన్స్ కూడా యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..