Geetha Subramanyam 3: ఆహా వేదికగా మళ్లీ రాబోతోన్న ‘గీతా సుబ్రహ్మణ్యం’.. మూడో సీజన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
‘ఆహా’లో అందరినీ మెప్పించే కంటెంట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక యూత్‌కు ఇష్టమైన ప్రేమ అనే అంశం మీద ఎక్కువగా ఆహా ఫోకస్ పెడుతుంటుంది. లోకల్ కంటెంట్‌ను ఎక్కువగా ప్రోత్సహించే క్రమంలో ఇప్పుడు గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌కు..
Geetha Subramanyam Season 3: ‘ఆహా’లో అందరినీ మెప్పించే కంటెంట్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక యూత్‌కు ఇష్టమైన ప్రేమ అనే అంశం మీద ఎక్కువగా ఆహా ఫోకస్ పెడుతుంటుంది. లోకల్ కంటెంట్‌ను ఎక్కువగా ప్రోత్సహించే క్రమంలో ఇప్పుడు గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌కు ఆహాలో తీసుకురాబోతోన్నారు. మే 5న ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. గీతా సుబ్రహ్మణ్యం ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రేమ కథలో సుప్రజ్ రంగా సుబ్రహ్మణ్యంగా కనిపించగా.. అభిజ్ఞ్య ఉతలూరు గీతగా నటించారు. ప్రేమలో ఉండే చిన్న పాటి గొడవలు ఎంతో ఫన్నీగా చూపించారు. ఎనిమిది ఎపిసోడ్‌లతో గీతాసుబ్రహ్మణ్యం అందరినీ మెప్పించేందుకు రెడీ అవుతోంది.
గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్ గీతా, సుబ్బుల మధ్య నడుస్తుంది. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బిజీ లైఫ్‌ను గడుపుతుంటారు. ఒక ప్రాజెక్ట్ కోసం ఈ ఇద్దరినీ ఎంపిక చేయడం, అందులో ఉద్యోగులు ఎలాంటి రిలేషన్ షిప్‌లో ఉండకూడదని కండీషన్ పెడతారు. కానీ ఆ కండీషన్‌ను గీతా, సుబ్బులు బ్రేక్ చేస్తారు. ప్రేమలో పడతారు. కానీ వారి ఫీలింగ్స్‌ను మిగతా ఉద్యోగుల ముందు బయట పెట్టకుండా మ్యానేజ్ చేస్తుంటారు.
Pagalantha Tom & jerry Evening intiki velli Chestharu lolli, lolli….? Vasthunnaranta malli…!! Geetha Subramanayam Season 3 premiers May 5.#GeethaSubramanyam3OnAHA@abhignya_v @jssvardhan @sreedhar0808 @pavanmusical @eshueeshwar @LankaSanthoshi @saideepreddy @rahultamada pic.twitter.com/ZlPAUE3NH2
— ahavideoin (@ahavideoIN) April 19, 2023
ఈ వెబ్ సిరీస్‌ను టమడ మీడియా నిర్మిస్తోండగా.. శివ సాయి వర్దన్ దర్శకత్వం వహించారు. 190కి పైగా దేశాల్లో ఎంతో మంది ఆడియెన్స్‌ను ఆహా అలరిస్తూ వస్తోంది. ఇప్పుడు ఈ గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌తో ఆహా తన వీక్షకులను అలరించనుంది. రొమాంటిక్ కామెడీ సిరీస్ అయిన గీతా సుబ్రహ్మణ్యం మూడో సీజన్‌ను మే 5న ఆహాలో మిస్ అవ్వకుండా చూడండి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..