Vishakhapatnam: ఉత్తరాది పుణ్యక్షేత్ర సందర్శకులకు శుభవార్త.. ప్రారంభమైన వారణాసి ప్రత్యేక రైలు సేవలు..

Vishakhapatnam-Varanasi Special Train: ఏప్రిల్ నెల ముగిసిందంటే వేసవి సెలవులు ప్రారంభమైనట్లే. ఇక ఉత్తర భారతంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే ఉద్యోగులకు, విద్యార్థులకు ఇదే సరైన సమయం. అటువంటి వారి కోసమే..

Vishakhapatnam: ఉత్తరాది పుణ్యక్షేత్ర సందర్శకులకు శుభవార్త.. ప్రారంభమైన వారణాసి ప్రత్యేక రైలు సేవలు..
Vishakhapatnam-Varanasi Special Train
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 19, 2023 | 5:07 PM

Vishakhapatnam-Varanasi Special Train: ఏప్రిల్ నెల ముగిసిందంటే వేసవి సెలవులు ప్రారంభమైనట్లే. ఇక ఉత్తర భారతంలోని పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే ఉద్యోగులకు, విద్యార్థులకు ఇదే సరైన సమయం. అటువంటి వారి కోసమే విశాఖపట్నం-వారణాసి ప్రత్యేక రైలును మంజూరు చేయించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆయన చొరవతో మంజూరైన ఈ ప్రత్యేక రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు అట్టహాసంగా జరిగింది.  విశాఖ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక రైలును సాధించి, దాన్ని అత్యంత పవిత్రమైన గంగా నది పుష్కరాలు సమయంలో విశాఖపట్నం వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్‌కు పలువురు నాయకులు,కార్యకర్తలు, యాత్రికులు,విశాఖ, ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

అలాగే ఈ విశాఖపట్నం-వారణాసి ప్రత్యేక రైలు కేవలం పుష్కర సమయంలోనే కాకుండా వేసవి సెలవులు ముగిసే వరకు కూడా నడపబడుతుందని ఏంపి జీవీఎల్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర, పార్టీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, గాజువాక కోఆర్డినేటర్ కేఎన్ఆర్, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు వంశీ యాదవ్ తదితరులు,పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అనేక మంది వారణాసి యాత్రికులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినందుకు ఎంపీ జీవీఎల్‌కు కృతజ్ఞతలు తెలియ చేసారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..