Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: టీమిండియాతో తలపడే ఆసీస్ టీమ్ ఇదే.. జట్టులో వార్నర్ కూడా.. ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా..

భారత్‌తో జూన్ నెలలో లండన్‌ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలో మొత్తం 17 మంది ఆటగాళ్లను..

WTC Final: టీమిండియాతో తలపడే ఆసీస్ టీమ్ ఇదే.. జట్టులో వార్నర్ కూడా.. ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా..
Australia Team For Wtc
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 19, 2023 | 4:31 PM

WTC Final: భారత్‌తో జూన్ నెలలో లండన్‌ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలో మొత్తం 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది ఆస్ట్రేలియా. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇదే స్క్వాడ్‌ ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌‌లో కూడ కనిపించనుంది. జూన్ 6 నుంచి 11 వరకు టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్, అలాగే జూన్ 16 నుంచి ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్‌ను ఆసీస్ టీమ్ ఆడనుంది. ఇక ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ పూర్తిగా ఫిట్‌గా తిరిగి జట్టులోకి వచ్చాడు. రెండు దేశాలలో ఆడేందుకు ప్రకటించిన స్క్వాడ్‌.. బౌలింగ్, బ్యాటింగ్ కోసం పూర్తిగా వారి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నిండి ఉంది.

పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్ వంటి ఆటగాళ్లు WTC, యాషెస్ సిరీస్‌ల కోసం ఆసీస్ శిబిరంలో ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు. వారితో పాటు టీమిండియాపై అరంగేట్రం చేసిన స్పిన్నర్ టాడ్ మర్ఫీ, వెటరన్ నాథన్ లియాన్‌ కూడా ఈ స్క్వాడ్‌‌లో భాగంగా ఉన్నారు. అదే విధంగా కెమెరూన్ గ్రీన్,  మిచెల్ మార్ష్ వంటి ఆల్ రౌండర్లు కూడా టీమిండియా, ఇంగ్లాండ్‌పై ధీటుగా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

జట్టులోకి తిరిగి వచ్చిన డేవిడ్ వార్నర్‌

ఇటీవలే భారత్ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ డేవిడ్ వార్నర్ రాణించలేకపోయాడు. ఫలితంగా తొలి టెస్ట్ తర్వాతే జట్టు నుంచి స్థానం కోల్పోయాడు. అయితే ఇప్పుడు WTC ఫైనల్, యాషెస్ సిరీస్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. తద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా(బోర్డ్) అతనిపై నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు వార్నర్. వీరితో పాటు మాట్ రెన్‌షా, మార్కస్ హారిస్ కూడా జట్టులో తమ స్థానాన్ని సంపాదించుకోగలిగారు.

WTC ఫైనల్, యాషెస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), అలెక్స్ కారీ, కెమెరూన్ గ్రీన్, స్కాట్ బోలాండ్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ మాట్ రెన్‌షా, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..