AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balagam Movie: ‘పాత్ర కోసమే నటించా, డబ్బుల కోసం కాదు’.. పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ‘బలగం’ నటి..

బలగం సినిమా షూటింగ్‌లో 35 రోజుల పాటు పాల్గొన్న లలిత.. బలగం సినిమా ఆడుతుందో లేదో అని భయపడ్డానని అన్నారు. కానీ సినిమా మాత్రం తాము ఊహించని స్థాయిలో విజయం సాధించిందని, తమకు ఎంతగానో పాప్యూలారిటీ పెరిగిందని

Balagam Movie: ‘పాత్ర కోసమే నటించా, డబ్బుల కోసం కాదు’.. పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ‘బలగం’ నటి..
Balagam
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 18, 2023 | 6:57 PM

Share

రూ. 70, 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలే ప్రేక్షకాధరణ పొందలేకపోతున్న ఈ మధ్య కాలంలో.. చాలా చిన్న సినిమాగా తెరకెక్కిన బలగం సినిమా మాత్రం రికార్డులు సృష్టించింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘బలగం’ మూవీని ప్రదర్శిస్తున్నారంటే.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎంతగా ఆదరణ లభించిందో అర్థం చేసుకోవవచ్చు. మరోవైపు ఈ సినిమాలో నటించినవారికి చాలా చిన్న మొత్తంలోనే పారితోషికం లభించినా.. పాప్యూలారిటీ మాత్రం పీక్స్‌లో ఉందని చెప్పుకోవాలి. ఇక బలగం సినిమాలో నటించిన లలిత(హీరోకి పిన్ని) సినిమా గురించి, రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Balagam Lalitha

‘బలగం’ లలిత

ఈ క్రమంలోనే బలగం మొగిలయ్య ఆరోగ్య స్థితి గురించి తెలిసి తనకు చాలా బాధ వేసిందని ఆమె తెలిపారు. ఆయనకు సినీ పరిశ్రమలోని సెలబ్రిటీల నుంచి సహాయం అందుతోందని లలిత చెప్పుకొచ్చారు. ఇక ‘బలగం’ కోసం సినిమా డైరెక్టర్ వేణు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తూ ఎంతగానో కష్టించేవారని తెలిపారు లలిత. అయితే 35 రోజుల పాటు సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆమె.. బలగం సినిమా ఆడుతుందో లేదో అని భయపడ్డానరి అన్నారు. కానీ సినిమా మాత్రం తాము ఊహించని స్థాయిలో విజయం సాధించిందని, తమకు ఎంతగానో పాప్యూలారిటీ పెరిగిందని పేర్కొన్నారు.

అనంతరం తనకు బలగం సినిమాలో నటించినందుకు.. రోజుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల పారితోషికం అందిందనే మాటలు అబద్ధమని అమె తెలిపారు. పరవలేదనే స్థాయిలో తనకు రెమ్యునరేషన్ దక్కిందని.. నేను పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చానని లలిత వెల్లడించారు. పాత్ర మంచిదని రెమ్యునరేషన్ తక్కువైనా అంగీకరించానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక దిల్ రాజు బ్యానర్‌లో ఛాన్స్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారని.. ఆ బ్యానర్‌లో ఛాన్స్ దక్కడమే అదృష్టమని లలిత చెప్పుకొచ్చారు. ఇలా బలగం సినిమా గురించి లలిత చెప్పుకొచ్చిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..