AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Game: టేబుల్ టెన్నిస్‌ స్థానంలోకి ‘హెడ్‌నిస్ ఆట’.. ఆడితే వచ్చే మజాయే వేరంటున్న నెటిజన్లు..

టేబుల్ టిన్నిస్ లేదా టెన్నిస్ ఆటలను ఆడేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఎక్కడ ఆడినా కూడా టెన్నిస్ ఆటలో బంతిని కొట్టడానికి బ్యాట్‌నే ఉపయోగిస్తారని మనకు తెలిసిందే. అయితే టెన్నిస్ ఆటను బ్యాట్ లేకుండా ఆడగలరా..

Funny Game: టేబుల్ టెన్నిస్‌ స్థానంలోకి ‘హెడ్‌నిస్ ఆట’.. ఆడితే వచ్చే మజాయే వేరంటున్న నెటిజన్లు..
Table Headnis
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 18, 2023 | 7:33 PM

Share

మనలో చాలా మంది టేబుల్ టిన్నిస్ లేదా టెన్నిస్ ఆటలను ఆడేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ఎక్కడ ఆడినా కూడా టెన్నిస్ ఆటలో బంతిని కొట్టడానికి బ్యాట్‌నే ఉపయోగిస్తారని మనకు తెలిసిందే. అయితే టెన్నిస్ ఆటను బ్యాట్ లేకుండా ఆడగలరా.. అది కూడా మీ తలతో..! తలతో టెన్నిస్ ఎలా ఆడతారని ఆలోచిస్తున్నారా..? వినడానికి అసాధ్యమే అనిపించినా చేసి చూపించారు ఓ ఇద్దరు వ్యక్తులు. ఇక వారు ఆడిన ఆటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడిాయాలో వైరల్ అవుతోంది. అలాగే వీడియోను చూసిన నెటిజన్లు ‘హెడ్‌నీస్ ఆట బాగుంది’ అని కామెంట్ చేస్తున్నారు.

CCTV IDIOTS అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో టేబుల్ టెన్నిస్ ఆటను తలతో సునాయాసంగా ఆడేస్తున్న ఇద్దరు వ్యక్తులను, వారి ఆటను మీరు చూడవచ్చు. అదేదో సరదాగా జరుగుతున్న ఆట కూడా కాదు.. దాన్ని చూడడానికి ప్రేక్షకులు కూడా వచ్చారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘టేబుల్ టెన్నిస్ స్థానంలో కొత్త ఆట వచ్చేసింది’ అంటూ సరదాగా కామెంట్ చేశారు ఓ నెటిజన్.

ఇవి కూడా చదవండి

‘హెడ్‌నిస్ ఆట’ను ఇక్కడ చూడండి..

అలాగే ‘ఈ ఆట చూడడానికి కొంచెం అసహజంగా ఉన్నా.. ఇందులో ఫన్ ఉంది’ అని మరొకరు తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘రసవత్తరమైన హెడ్‌నిస్ ఆట వచ్చేసింది.. ఇక టేబుల్ టెన్నిస్ ఆటకు స్వస్తి పలికినట్లేనా..2 అని ఇంకొకరు రాసుకొచ్చారు. ఇంకా ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షల 4 వేలకు పైగా లైకులు, 11 వేలకు పైగా లైకులు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..