Video: టీమిండియాలోకి మరో హైదరాబాదీ ప్లేయర్ ఎంట్రీ?.. స్టార్ ప్లేయర్‌ల ప్లేస్‌లకు ఎసరు పెట్టేశాడుగా..

SRH VS MI: హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కామెరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్ పేర్లు.. మరుగున పడేలా చేశాడు ఓ యంగ్ ప్లేయర్. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆ యువ ఆటగాడికి సెల్యూట్ చేయడం విశేషం.

Video: టీమిండియాలోకి మరో హైదరాబాదీ ప్లేయర్ ఎంట్రీ?.. స్టార్ ప్లేయర్‌ల ప్లేస్‌లకు ఎసరు పెట్టేశాడుగా..
Tilak Varma
Follow us
Venkata Chari

|

Updated on: Apr 19, 2023 | 3:30 PM

Tilak Varma: మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. ఎట్టకేలకు IPL 2023లో తమ విజయ పథాన దూసుకెళ్తోంది. ఈ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో వేగంగా దూసుకుపోతోంది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కామెరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్ పేర్లు.. మరుగున పడేలా చేశాడు ఓ యంగ్ ప్లేయర్. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆ యువ ఆటగాడికి సెల్యూట్ చేయడం విశేషం.

ఈ ఆటగాడు మరెవరో కాదు.. హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ. ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా ఫిదా అయింది. దీంతో డ్రెస్సింగ్‌ రూంలో తిలక్ వర్మను ప్రత్యేకంగా సత్కరించారు. హైదరాబాద్‌పై తిలక్ వర్మ ఇన్నింగ్స్ కొద్దిసేపే అయినా.. మైదానంలో పిడుగుల వర్షం కురిపించాడు. 17 బంతుల్లో 37 పరుగులతో చూడ ముచ్చటైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుంచి 4 సిక్సర్లు వచ్చాయి. ఈ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్ 192 పరుగులకు చేరుకోవడానికి సహాయపడింది. డ్రెస్సింగ్ రూమ్‌లో అతనికి ప్రత్యేక బ్యాడ్జ్ ఇవ్వడానికి కారణం కూడా ఇదే.

ఇవి కూడా చదవండి

త్వరలోనే టీమిండియాలోకి..

రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ యువ ఆటగాడు త్వరలో ఇతర దుస్తులలో కూడా కనిపిస్తాడని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. తిలక్ వర్మ వయసు, బ్యాటింగ్ తీరు చూస్తుంటే చాలా దూరం వెళ్తాడని ప్రశంసించాడు. దీంతో ఇదే ఫాం కొనసాగిస్తే.. టీమిండియాలోకి మరో హైదరాబాదీ ప్లేయర్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నెటిజన్లు కూడా ఇదే విషయంపై తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీలు టీ20లు ఆడడం లేదు. మరోవైపు వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి కూడా వీరిద్దరు తప్పుకునే అవకాశం ఉంది. దీంతో తిలక్ వర్ ఎంట్రీ ఖాయమైనట్లేనని తెలుస్తోంది. వన్డేల్లో కోహ్లీ ప్లేస్‌లోనూ, టీ20ల్లో శాంసన్ లేదా శ్రేయాస్ అయ్యర్ స్థానాల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముంబై విజయానికి కేరాఫ్ అడ్రస్..

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ముంబైలో అత్యధిక పరుగులు చేసినవారిలో తిలక్ అగ్రస్థానంలో ఉన్నాడు. 5 మ్యాచ్‌ల్లో అతని బ్యాట్‌ నుంచి 214 పరుగులు వచ్చాయి. ఈ ఆటగాడి సగటు 50 గా నిలిచింది. ఇది మాత్రమే కాదు, తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ కూడా దాదాపు 160గా కొనసాగుతోంది. ముంబై తరపున అత్యధికంగా 14 సిక్సర్లు కొట్టాడు. తిలక్ వర్మ ఈ పర్ఫామెన్స్ చూసి రోహిత్ శర్మ లాంగ్ రేస్ హార్స్ అని అంచనా వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..