Andhra Pradesh: ఏపీలో స్కూళ్లకు ఎన్ని రోజులు వేసవి సెలవులంటే.? ఈసారి ముందుగానే.!!
ఏపీ స్కూల్స్‌కు వేసవి సెలవులు ఈ నెలాఖరు నుంచి ఉండనున్నాయని సమాచారం. 1-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 27తో పరీక్షలు ముగియనున్నాయి. అవి అయిన రెండు రోజులకు సెలవులు ప్రకటించనున్నారు. అయితే ఉష్ణోగ్రతలు అధికం అవుతుండటంతో..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 1-9 తరగతుల విద్యార్ధులకు జగన్ సర్కార్ ఏప్రిల్ 30 నుంచి వేసవి సెలవులను ప్రకటించనున్నట్లు సమాచారం. వీరికి ఈ నెల 27వ తేదీతో పరీక్షలు ముగియనుండగా.. మరో రెండు రోజులు ఫలితాలు వెల్లడి, పేరెంట్స్ మీటింగ్స్ మొదలైనవి ఉంటాయి. అవి పూర్తి కాగానే వేసవి సెలవులను ప్రకటించనున్నారని ఈ నెల 30 నుంచి స్కూల్స్‌కు సెలవులు ఇచ్చే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ ద్వారా అనధికారికంగా తెలిసింది.
అయితే ప్రస్తుతం రాష్ట్రమంతటా పగటి ఉష్ణోగ్రతలు అధికం అవుతుండటంతో.. ఈ సెలవులు షెడ్యూల్ కాస్త ముందుకు జరిగే ఛాన్స్ ఉందట. కాగా, 2023-24 విద్యా సంవత్సరానికి గానూ స్కూల్స్ మళ్లీ తిరిగి జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి ఏపీ విద్యార్ధులకు సుమారు 45 రోజుల పాటు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.