AP Crime: స్విమ్మింగ్‌ఫూల్‌లో మునిగి 11 ఏళ్ల బాలుడు మృతి.. ఆ ఐదునిముషాల్లో ఏం జరిగింది?
అనకాపల్లి జిల్లాలో స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి బాలుడు మృతి చెందాడు. సరదాగా నీటిలో దిగిన పాపానికి బాలుడి ప్రాణాలు తోడేసింది. అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకెళ్తే.. అనకాపల్లి వుడ్ పేటలో నివాసముంటున్న..
అనకాపల్లి జిల్లాలో స్విమ్మింగ్ ఫూల్‌లో మునిగి బాలుడు మృతి చెందాడు. సరదాగా నీటిలో దిగిన పాపానికి బాలుడి ప్రాణాలు తోడేసింది. అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకెళ్తే.. అనకాపల్లి వుడ్ పేటలో నివాసముంటున్న సతీష్ కిరణ్ కుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు. 11 ఏళ్ల ప్రభాస్, నాలుగేళ్ల వర్షాను తీసుకొని శంకరం వద్దనున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్ళింది. మూడు రోజులుగా ప్రభాస్ మారం చేయడంతో… ఈనెల 17వ తేదీ సాయంత్రం ఇద్దరు పిల్లలు తీసుకొని తల్లి వెళ్ళింది. అక్కడ ప్రభాస్ స్విమ్మింగ్ పూల్ లో దిగాడు. ట్యూబ్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. ఇంతలో గట్టుపై ఉన్న చిన్న కొడుకు హర్ష బయటవైపు పరిగెత్తాడు. అతన్ని పట్టుకున్నందుకు వెళ్ళింది. తిరిగి వచ్చే చూసేసరికి స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ప్రభాస్ కనిపించలేదు.
దీంతో ఆందోళనకు చెందిన తల్లి పరిసర ప్రాంతాల్లో గాలించింది. ప్రభాస్ అశోక్ లేకపోవడంతో నిర్వాహకులను అడిగింది. స్విమ్మింగ్ పూల్ లోపలికి దిగి చూసేసరికి…పూల్లో మునిగిపోయినట్టు గుర్తించారు. అపస్మారక పరిస్థితిలో ప్రభాస్ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటపడ్డాడు. హుటా హుటానా ఆసుపత్రికి తరలించిన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఐదు నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది అని తల్లి కిరణ్ కుమారి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరో ఘటన.. ఆర్కే బీచ్‌లో ఐటిఐ విద్యార్ధి గల్లంతు..
విశాఖ తీరంలో విషాదం నెలకొంది. విశాఖలోని ఆర్కే బీచ్‌లో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులతో బీచ్‌లో సేదదీరేందుకు సరదాగా వచ్చిన ఓ విద్యార్థి సముద్రంలో గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐటిఐ చదువుతోన్న విద్యార్థులు కొందరు ఆర్కేబీచ్‌కి వచ్చారు. నీటిలోకి దిగిన ఐటిఐ విద్యార్థి ఒకరు గల్లంతయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.