Kangana Ranaut: అందుకే అమిర్ ఖాన్ దూరమయ్యారు.. ఆసక్తికర అంశాలు వెల్లడించిన కంగనా..!
Kangana Ranaut: బాలీవుడ్ హీరో హృతిక్‌తో వివాదంపై కంగనా రనౌత్ మరోసారి స్పందించారు. హృతిక్‌తో వివాదం కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను ఎంతో నష్టపోయానన్నారు. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఓ మెంటర్‌గా, బెస్ట్ ఫ్రెండ్‌గా తనకు అమిర్ ఖాన్ సలహాలు ఇచ్చారని కొనియాడారు.
బాలీవుడ్ హీరో హృతిక్‌తో వివాదంపై కంగనా రనౌత్ మరోసారి స్పందించారు. హృతిక్‌తో వివాదం కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తాను ఎంతో నష్టపోయానన్నారు. తన కెరీర్ తొలినాళ్లలో ఓ మెంటర్‌గా, బెస్ట్ ఫ్రెండ్‌గా తనకు అమిర్ ఖాన్ సలహాలు ఇచ్చారని కొనియాడారు. తన నటనను మెచ్చుకుంటూ అమిర్ సార్ ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. అయితే హృతిక్‌తో వివాదం కారణంగా అమిర్ ఖాన్ తనకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ఇండస్ట్రీకి వ్యతిరేకమన్నట్లు వారందరూ ఒక్కటి అయ్యారని పేర్కొన్నారు. ఆ మేరకు ఓ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు కంగనా. హృతిక్‌తో వివాదంపై కంగనా ఇన్‌స్టా వేదికగా చేసిన ఈ కామెండ్స్ బాలీవుడ్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి..
హృతిక్‌తో కంగనా వివాదం ఏంటి?
హృతిక్ రోషన్, కంగనా రనౌత్ కలిసి 2010లో కైట్స్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డట్లు పుకార్లు వినిపించాయి. చాలా కాలం పాటు వీరి రిలేషన్ కొనసాగినట్లు సమాచారం. దాదాపు పెళ్లి వరకు వెళ్లింది వ్యవహారం. కానీ ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో అనూహ్య రీతిలో వీరిద్దరూ విడిపోయారు. సోషల్ మీడియా వేదికగా ‘సిల్లీ ఎక్స్’ అంటూ హృతిక్‌ను ఉద్దేశించి కంగనా కామెంట్స్ చేసింది. దీనిపై హృతిక్ తీవ్రంగా స్పందించాడు. పరస్పరం పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది వ్యవహారం. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య కాకరేపిన వివాదాల ప్రస్తావన వస్తే.. అందులో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వివాదం కూడా చర్చకు వస్తుంటుంది.
బాలీవుడ్‌లో బంధుప్రీతి(నెపోటిజం)పై గళం వినిపిస్తూ కంగనా నిత్యం మీడియా దృష్టిని ఆకర్షించారు. హృతిక్ రోషన్ కూడా నెపోటిజంతోనే ఇండస్ట్రీలోకి వచ్చారంటూ ఓ సందర్భంలో విమర్శించారు. ఇండస్ట్రీలో నాన్న రాకేష్ రోషన్ లేకుంటే హృతిక్ రోషన్ అతని ఇంటి అద్దెను కూడా చెల్లించలేరంటూ కంగనా ఎద్దేవా చేయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇన్‌స్టా స్టోరీస్‌లో కంగనా చేసిన లేటెస్ట్ పోస్ట్..
మరిన్ని సినిమా కథనాలు చదవండి