Redmi Smart Fire TV: రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీ.. అదరగొడుతున్న ఫీచర్లు

ఫైర్ ఓస్ ఆధారితంగా పని చేసే 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.13,999కు వినియోగదారులకు అందిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలకు గణనీయంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ టీవీని లాంచ్ చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Redmi Smart Fire TV: రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీ.. అదరగొడుతున్న ఫీచర్లు
Redmi Tv
Follow us
Srinu

|

Updated on: Apr 25, 2023 | 4:15 PM

ప్రముఖ సంస్థ రెడ్‌మీ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ టీవీను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన ఈ టీవీలో ఎన్నో అధునాతన ఫీచర్లను కంపెనీ అందిస్తుంది. ఫైర్ ఓస్ ఆధారితంగా పని చేసే 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.13,999కు వినియోగదారులకు అందిస్తుంది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలకు గణనీయంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ టీవీని లాంచ్ చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ 5, సోనిలైవ్, యూట్యూబ్ వంటి యాప్స్ సపోర్ట్ చేసేలా ఫైర్ ఓఎస్ 7 ఉంది. అలాగే ఈ టీవీలో దాదాపు 70 కంటే అధికంగా చానెల్స్‌ను లైవ్ ద్వారా ఎంజాయ్ చేయవచ్చు. అయితే రెడ్‌మీ టీవీ గురించి మరిని వివరాలను ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

ఫైర్ టీవీ డిజైన్

ఈ టీవీ మూడు వైపులా సన్నని బెజెల్‌లతో కూడిన సాధారణ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. ఇది టీవీకి సొగసైన రూపాన్ని ఇస్తుంది. అలాగే టీవీ స్టాండ్ కూడా ఆకర్షణీయంగా ఉటుంది. అయితే ఈ టీవీని గోడపై మౌంట్ చేయాలనుకుంటే విడిగా వాల్ మౌంట్‌ను కొనుగోలు చేయాలి. అయితే మార్కెట్‌లో దొరికే ఇతర టీవీలతో పోలిస్తే ఈ టీవీ బరువు కాస్త ఎక్కువగా ఉంది. రెండు యూఎస్‌బీ టైప్-ఏ పోర్ట్‌లు, 3.5 ఎఎం ఆక్స్ పోర్ట్, రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్‌తో సహా మీకు అవసరమైన ప్రతిదాన్ని టీవీ అందిస్తుంది. టీవీ దిగువన తెల్లటి ఎల్ఈడీ సూచిక, ఫిజికల్ పవర్ బటన్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రిమోట్ కంట్రోల్‌లో ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కోసం క్విక్ యాక్సెస్ బటన్‌లతో పాటు అలెక్సా వాయిస్ అసిస్టెన్స్ బటన్ ఉన్నాయి. అదనంగా గైడ్, మ్యూట్, వాల్యూమ్ సర్దుబాటు, నావిగేషన్, ప్లేబ్యాక్ నియంత్రణ బటన్, పవర్ బటన్‌లు ఉన్నాయి. ముఖ్యంగా అలెక్సా బటన్‌తో మీ ఇంటిలో స్మార్ట్ పరికరాలను నియంత్రించే అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

డిస్‌ప్లే, ఆడియో

డిస్ప్లే విషయానికి వస్తే రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 1366 x 768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే టీవీల్లో వచ్చే రంగు కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ టీవీలో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వీక్షకులు చిత్ర నాణ్యతను రాజీ పడకుండా గదిలోని దాదాపు ఏ స్థానం నుంచి అయినా వీక్షించడానికి వీలు కల్పిస్తుంది. ఇది చిన్న కుటుంబ గదులు లేదా బెడ్‌రూమ్‌లకు ఈ టీవీ మంచి ఎంపిక అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 20 వాట్స్ స్టీరియో స్పీకర్‌తో వినియోగదారులకు మంచి ఆడియో అనుభూతిని ఇస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..