- Telugu News Photo Gallery Technology photos Redmi launches fire tv 32 inches in 12k budget Telugu Tech News
Smart TV: వారెవ్వా ఏమన్న టీవీనా.. రూ. 12 వేలకే 32 ఇంచెస్ స్క్రీన్. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ రెడ్‌మీ తాజాగా కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. అమెజాన్‌తో కలిసి రెడ్‌మీ తన ఫైర్ టీవీని తీసుకొచ్చింది. ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ టీవీని తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు. కేవలం రూ. 12 వేలలోనే 32 ఇంచెస్ స్క్రీన్ ఈ టీవీ సొంతం..
Updated on: Mar 27, 2023 | 7:44 PM

ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ టీవీ హల్చల్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన టీవీలను కంపెనీలు లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో కలసి రెడ్‌మీ తన ఫైర్ టీవీని లాంచ్ చేసింది. ఇది ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.

టీవీ ధర విషయానికొస్తే.. 32 అంగుళాల కేవలం రూ. 12,000కే అందుబాటులో ఉంది. అంతేకాక అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీలో వివిడ్ పిక్చర్ ఇంజిన్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లను అందించారు.

ఈ టీవీ అసలు ధర రూ. 13,999కాగా ప్రారంభ ఆఫర్ కింద అన్ని రకాల డిస్కౌంట్స్‌లను కలుపుకొని రూ. 11,999కే ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంటుంది.

ఈ ఫైర్ టీవీలో 20 వాట్స్ పవర్ ఫుల్ స్పీకర్స్ ఉన్నాయి. 1 జీబీ ర్యామ్- 8 జీబీ స్టోరేజ్ కూడా లభిస్తోంది. ఇన్ బిల్ట్ అలెక్సా బటన్ కూడా ఉంటుంది. ఎయిర్ ప్లే, మిరాకాస్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

ఇందులోని ఫైర్ ఓఎస్ 7ను బట్టి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, యూట్యూబ్ వంటి వాటితో పాటు మరిన్నింటితో సహా ఫైర్ టీవీ యాప్ స్టోర్ నుంచి 12,000కు పైగా యాప్‌లను వినియోగించుకోవచ్చు.




