Note 12 turbo: రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలో మైండ్‌ బ్లోయింగ్ ఫీచర్స్‌.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రెడ్‌మీ నోట్‌ టర్బో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. చైనాలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ ఫోన్‌..

Note 12 turbo: రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. తక్కువ ధరలో మైండ్‌ బ్లోయింగ్ ఫీచర్స్‌.
Note 12 Turbo
Follow us

|

Updated on: Mar 31, 2023 | 11:04 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ ఇటీవల వరుసగా స్మార్ట్‌ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఫోన్‌లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రెడ్‌మీ నోట్‌ టర్బో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. చైనాలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టనుంది. మొత్తం నాలుగు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz ఈ ఫోన్‌ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో రెయిర్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+8MP+2MP కెమెరాలను అందించారు.

ఇక సెల్ఫీల కోసం ప్రత్యేకంగా 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 67W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్‌ + 256 జీబీ మోడల్‌ ధర రూ. 23,900, 12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ ధర రూ. 26,300 కాగా, 12జీబీ ర్యామ్‌ + 512 జీబీ ధర రూ. 28,700, 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్ ధర రూ. 33,400గా ఉంది. బ్లూ, కార్బన్ బ్లాక్, ఐస్ ఫెదర్ వైట్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..