- Telugu News Photo Gallery Technology photos Users can send files from smart phone to smart tv without using pendrive Telugu Tech News
Smart TV: ఫోన్ నుంచి టీవీకి ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఇక చాలా ఈజీ.. పెన్ డ్రైవ్ కూడా అవసరం లేకుండానే..
స్మార్ట్‌టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టీవీల్లో ఫైల్స్ పంపించుకొని చూడడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే టీవీలోకి ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే కచ్చితంగా పెన్ డ్రైవ్ ఉండాలని తెలిసిందే. అలా కాకుండా ఒక యాప్ ద్వారా నేరుగా ఫైల్స్‌ను సెండ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ యాప్ ఏంటి.? ఎలా ఉపయోగించాలంటే..
Updated on: Mar 31, 2023 | 9:20 AM

మారుతోన్న కాలంతో పాటు టెక్నాలజీలోనూ మార్పులు వస్తున్నాయి. ఇలా టెక్నాలజీ కారణంగా మారిన వాటిలో టీవీలు ఒకటి. ఒకప్పుడు మాములుగా ఉండే టీవీలు ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోయాయి.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ టీవీలు వచ్చాక యూజర్లకు అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి యూట్యూబ్ వరకు.. గేమ్స్ నుంచి వీడియో కాల్స్ వరకు అన్నింటికీ కేరాఫ్ మారింది స్మార్ట్ టీవీ.

ఇదిలా ఉంటే సాధారణంగా టీవీలోకి ఏవైనా వీడియో, ఆడియా ఫైల్స్ పంపించుకోవాలంటే పెన్‌డ్రైవ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం. స్మార్ట్ టీవీలు ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రావడమే దీనికి కారణం.

అయితే ఒకవేళ పెన్ డ్రైవ్ అందుబాటులో లేకపోయినా స్మార్ట్‌ఫోన్‌ను మీ టీవీ ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇందు కోసం మీరు 'సెండ్ ఫైల్స్ టు టీవీ' అనే యాప్‌ను టీవీతో పాటు ఫోన్‌నులోనూ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

తర్వాత అవసరమైన అన్ని పర్మిషన్స్ ఇస్తే.. స్మార్ట్‌ఫోన్ నుంచి టీవీకి, టీవీ నుంచి ఫోన్‌లోకి ఫైల్స్‌ను పంపించుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి ఇంటర్‌నెట్ సదుపాయం కూడా ఉండాల్సిన పనిలేదు. ఈ యాప్ బాగుంది కదూ.? పెన్‌డ్రైవ్‌ల కోసం డబ్బులు ఖర్చు చేయడం కంటే ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.




