India vs Bangladesh: ఇవాళ కూడా మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది..?

వర్షం కారణంగా కేవలం 35 ఓవర్స్‌లో ఆటను ముగించారు. అప్పటికి బంగ్లా 107 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోపోయింది. బంగ్లా ఆటగాళ్లు మొమినుల్ హక్ 40 పరుగులు చేయగా, ముష్పికర్ రహీమ్ 6 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు.

India vs Bangladesh: ఇవాళ కూడా మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది..?
Ind Vs Bang
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 28, 2024 | 1:11 PM

ఇటీవలే చెన్నైలో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో భారీ పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండు టెస్ట్‌‌‌లో విజయం సాధించి క్వీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతుంది. ఈ సందర్భంగా రెండు టెస్టును కూడా మంచిగానే ప్రారంభించింది. కానీ అనూహ్యంగా వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా కేవలం 35 ఓవర్స్‌లో ఆటను ముగించారు. అప్పటికి బంగ్లా 107 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోపోయింది. బంగ్లా ఆటగాళ్లు మొమినుల్ హక్ 40 పరుగులు చేయగా, ముష్పికర్ రహీమ్ 6 పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నారు. శనివారం కూడా మ్యాచ్ వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ వర్షం కారణంగా కాస్త లేటుగా ఆరంభమైన టాస్ గెలిచిన భారత్..కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోకుండా బౌలింగ్ తీసుకోవడం ఒక్కసారిగా అందిరినీ ఆశ్చర్చానికి గురి చేసింది. ఇలా 2015లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్న తర్వాత తొలిసారి సొంతగడ్డపై మళ్లీ రోహిత్ బౌలింగ్ ఎంచుకోవడం విశేషం.పేసర్లకు కాన్పర్‌‌లో అనుకూలిస్తుండటంతో హిట్ మ్యాన్ బౌలింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

తొలి టెస్ట్ మ్యాచ్ టీమ్‌లో ఆడిన ప్లేయర్లనే రెండో మ్యాచ్‌లో దింపింది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో రంగంలో దిగారు. ఇక బంగ్లాదేశ్ పేసర్ నహిద్ రాణాను తీసేసి స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్‌ను తీసుకొచ్చింది. మరో పేసర్ తస్విన్ అహ్మద్‌ను తొలగించి ఖలెద్ అహ్మద్‌‌కి అవకాశం ఇచ్చింది. మొదటి రోజు మ్యాచ్‌లో ఆకాశ్ దీప్ బౌలింగ్ అద్భుతంగా చేశాడు. బూమ్రా కంటే బెటర్‌‌గా బౌలింగ్ చేశాడు. సిరాజ్‌ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. ఓపెనింగ్ వచ్చిన బంగ్లా ప్లేయర్లు షాద్మన్, జాకిర్ హసన్‌ చూసుకుంటూ ఆడారు. డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశారు.

రెండో రోజు కూడా వర్షం పడితే ఏం జరుగుతుంది?

రెండు రోజు వర్షం ఇలానే కొనసాగితే ఆట మూడోవ రోజుకు వాయిదా వేస్తారు. అయితే ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఏ ఫలితం లేకుండా పోతుంది. దీంతో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సీరిస్‌ను గెలుచుకుంటుంది. మ్యాచ్ జరిగాలని వరుణుడు కరణించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. నవంబర్‌ 22 నుంచి ఆసీస్‌తో భారత్ టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానునంది. 2016 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే.