AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smt G. Syamala : 47 ఏళ్ల వయసులో శ్రీలంక తీరం నుంచి ధనుష్కోడికి 30 కి.మీ ఈతకొట్టి చేరిన మన హైదరాబాద్ మహిళ

Swimmer Smt G. Syamala : మన హైదరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల శ్రీమతి జి. శ్యామల చరిత్ర సృష్టించారు. 30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి జలసంధిలో..

Smt G. Syamala : 47 ఏళ్ల వయసులో శ్రీలంక తీరం నుంచి ధనుష్కోడికి 30 కి.మీ ఈతకొట్టి చేరిన మన హైదరాబాద్ మహిళ
Smt Syamala
Venkata Narayana
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 20, 2021 | 7:58 AM

Share

Swimmer Smt G. Syamala : మన హైదరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల శ్రీమతి జి. శ్యామల చరిత్ర సృష్టించారు. 30 కిలోమీటర్ల మేర శ్రీలంక నుండి భారతదేశానికి జలసంధిలో విజయవంతంగా ఈదారు. సముద్రంలో ఇంత దూరం ఈత కొట్టిన తొలి తెలుగు మహిళగా రికార్డు క్రియేట్ చేయడమేకాదు, ప్రపంచంలో రెండవ మహిళగా నిలిచారు. శుక్రవారం తెల్లవారుజామున 4:15 గంటలకు శ్రీలంక తీరం నుంచి ప్రారంభమైన ఆమె, 13 గంటల 43 నిమిషాల పాటు నిరంతరంగా ఈత కొట్టిన తరువాత రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు.

శ్రీమతి శ్యామల ఒక వ్యవస్థాపకురాలు. ఈ సముద్ర ఈత కోసం ఆమెకు సీనియర్ ఐపిఎస్ అధికారి రాజీవ్ త్రివేది శిక్షణ ఇవ్వడమేకాదు, మార్గనిర్దేశం కూడా చేశారు. 2012 లో 12 గంటల 30 నిమిషాల్లో ఇదే జలసంధిని త్రివేది దాటారు. శ్రీమతి శ్యామల తన సక్సెస్ ఫుల్ జర్నీకోసం కొన్నేళ్ల క్రితం నుంచి త్రివేది దగ్గరే ఈత మెలుకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు అనుకున్నది సాధించిన ధీర మహిళగా చరిత్రకెక్కారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి

Read also : MP Nandigam Suresh slams RRR : ఆర్ఆర్ఆర్ పై విరుచుకుపడ్డ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌