ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అజేయంగా దూసుకెళ్తోన్న భారత అగ్రశ్రేణి బాక్సర్ విజేందర్ సింగ్ మరో ఆసక్తికర ఫైట్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ తన కెరీర్లో ఓటమన్నదే తెలియని విజేందర్.. శుక్రవారం రష్యా పొడగరి బాక్సర్ ఆర్టిష్ లాప్పన్ను చిత్తు చేసేందుకు ఫిక్స్ అయ్యాడు. ఈ బౌట్ ఓడ మీద జరగబోతుండటంతో అందరితో ఆసక్తి నెలకొంది. అరేబియా సముద్ర జలాల మీద మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో నౌకపై భాగంలో జరిగే ఈ పోరులో బాక్సర్లు విజయం కోసం పోరాడనున్నారు.
ప్రొఫెషనల్ కెరీర్ బౌట్ల రికార్డు 12-0గా… ఇందులో 8 నాకౌట్లు ఉన్నాయి. అయితే 35 ఏళ్ల విజేందర్ 2019 నవంబర్ తర్వాత తొలిసారి రింగ్‌లో అరంగేట్రం చేశాడు. 26 ఏళ్ల ప్రత్యర్థి నుంచి అతనికి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. 6.4 అడుగుల పొడవున్న లాప్సన్ ఇప్పటివరకు ఆరు బౌట్లలో నాలుగింట్లో గెలిచాడు. ఒక దాంట్లో మాత్రమే ఓడిపోయిన రికార్డ్ ఉంది. ఇందులో మరోదాన్ని డ్రా చేసుకున్నాడు.
ఈ రోజు జరగనున్న బౌట్ ప్లాన్‌ను విజేందర్ సింగ్ రివిల్ చేశాడు. లాప్సన్ పొడుగ్గా ఉంటాడు. అతనితో బౌట్‌ను నెమ్మదిగా ఆరంభిస్తానని అన్నాడు. ఏదేమైనా అతణ్ని ఓడిస్తాననే నమ్మకంతో ఉన్నట్లుగా ధీమా వ్యక్తం చేశాడు. బాక్సింగ్‌లో ఎత్తుగా ఉంటే సరిపోదు… బలం.. వ్యూహం కావాలని చెప్పుకొచ్చాడు. నా అనుభవంతో పోలిస్తే అతనో పిల్లాడు అని తెలిపాడు. ఈ బౌట్ తర్వాత కూడా నా అజేయ రికార్డు కొనసాగుతుందని పూర్తి స్థాయి జోష్‌లో కనిపించాడు విజేందర్ సింగ్. ప్రత్యర్థి ఎంత కఠినంగా ఉంటే పోరు అంత సరదాగా ఉంటుందని విజేందర్ పేర్కొన్నాడు.