Saina Nehwal Injury: రిటైర్డ్ హార్ట్‌గా టోర్నీ నుంచి ఔట్.. తొడ కండరం నొప్పితో తప్పుకున్న సైనా నెహ్వాల్..
ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్డ్ హార్ట్ అయ్యారు. గాయం కారణంగా తొలి మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్‌లో...
ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ రిటైర్డ్ హార్ట్ అయ్యారు. గాయం కారణంగా తొలి మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్ సైనా సెహ్వాల్ తొలి రౌండ్నుంచే వెనుదిరిగారు. గాయం కారణంగా మ్యాచ్మధ్యలోనే రిటైర్డ్ హర్ట్‌గా తప్పుకున్నారు. డెన్మార్క్‌కు చెందిన మియా బిచ్ఫెల్ట్తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి సెట్‌ను 8-21తో కోల్పోయిన సైనా, రెండో సెట్‌లో 4-10తో వెనకబడిన క్రమంలో మ్యాచ్ నుంచి తుప్పుకున్నారు.
రెండో సెట్‌లో సైనాకు ఇబ్బందులు మొదలయ్యాయి. సైనా కొద్దిగా అసౌకర్యానికి గురయ్యారు. ఆమె కుడి తొడ నొప్పి కారణంగా మ్యాచ్ నుంచి ఒక్కసారిగా తప్పుకున్నారు. ఈ క్రీడా సంవత్సంలో సైనాకు పెద్దగా కలిసి రాలేదు. జనవరిలో యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్‌లో రెండో రౌండ్ నుంచి వెనుదిరిగారు. టయోటా థాయిలాండ్ ఓపెన్‌లో కనీసం ప్రారంభ రౌండ్‌ను సైతం దాటలేకపోయారు.
ఇక.. హైదరాబాద్‌కు చెందిన మరో షట్లర్ పీవీ సింధు మాత్రం శుభారంభం చేశారు. బుధవారం ఇక్కడ టోర్నీ ప్రారంభం కాగా మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ సింధు 21-11, 21-17 తేడాతో సోనియా చెహ్‌పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కిడాంబి శ్రీకాంత్ 11-21, 21-15, 12-21తో గుయెల్ నాట్ చేతిలో, కశ్యప్ 13-21, 20-22తో టాప్ సీడ్ కెంటా మొమోటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక మహిళల డబుల్స్‌లో ఎన్.సిక్కిరెడ్డి – అశ్వినీ పొన్నప్ప ద్వయం 21-14, 21-12 తేడాతో బెన్యప ఐమ్సార్డ్, నుంటకర్న్‌పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించింది.