Indian Boxer Nikhat Zareen: టర్కీ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి దూకుడు.. పతకం గ్యారెంటీ అంటున్న నిఖత్ జరీన్
nikhat zareen: భారత బాక్సర్, తెలుగమ్మాయి నిఖత్ జరీన్ తన పంచ్ పవరేంటో చూపించేందుకు రెడీ అవుతోంది. రింగ్‌లోకి దిగితే పతకం పక్కా అన్న రీతిలో ప్రత్యర్థులకు పంచులతో..
Boxer Nikhat Zareen: భారత బాక్సర్, తెలుగమ్మాయి నిఖత్ జరీన్ తన పంచ్ పవరేంటో చూపించేందుకు రెడీ అవుతోంది. రింగ్‌లోకి దిగితే పతకం పక్కా అన్న రీతిలో ప్రత్యర్థులకు పంచులతో సవాలు విసురుతోంది. ఇస్తాంబుల్ బాస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో పతకం కొట్టేలా కనిపిస్తోంది. గురువారం సెమీఫైనల్ పోరులో తలపడేందుకు రెడీ అవుతోంది.
టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న బోస్ఫోరస్ బాక్సింగ్ టోర్నీలో నిఖత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల 51కిలోల క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5-0 తేడాతో మాజీ ప్రపంచ చాంపియన్ రష్యాకు చెందిన ఎక్టరీనా పట్సెవాపై ఈజీగా విజయాన్ని అందుకుంది. ఈ సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
రింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయం నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ నిజామాబాద్ అమ్మాయి పంచ్ పవర్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. క్లీన్ పంచ్‌లతో చెలరేగిన జరీన్ సెమీస్ చేరి కాంస్య పతకం ఖరారు చేసుకుంది.
మరోవైపు కామన్వెల్త్ స్వర్ణ విజేత గౌరవ్ సోలంకి, సోనియా లాథర్ విజయాలతో టోర్నీలో ముందువరసలో ఉన్నారు. నమన్ తన్వర్, పీఎల్ ప్రసాద్, ప్రయాగ్ చౌహాన్, పూజ ఓటములతో టోర్నీ నుంచి వైదొలిగారు.
ఆ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధిస్తే టోక్యో, జపాన్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హత సాధించానుందని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి నిఖత్ జరీన్‌ను అభినందించారు.