- Telugu News Photo Gallery Sports photos Former england womens keeper sarah taylor will work with the men team
అందంలోనే కాదు ఆటలోనూ అద్భుతం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్‌గా సారా టేలర్
Sarah Taylor will work with men team : ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్ పురుషుల జట్టుకు కోచ్‌గా పనిచేయనున్న తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు.
Updated on: Mar 17, 2021 | 2:39 PM

ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన రికార్డును దక్కించుకున్నారు. తొలిసారి పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్‌లోని దేశవాళీ జట్టు ససెక్స్‌కు వికెట్ కీపింగ్ కోచ్‌గా పనిచేయనున్నారు.

పురుషులతో కలిసి అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడిన మొదటి మహిళా క్రికెటర్ కూడా సారాయే కావడం గమనార్హం.

ఇంగ్లాండ్ మహిళ జట్టు తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా టేలర్ 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సుదీర్ఘ ఫార్మాట్లో 300, వన్డేల్లో 4,056, టీ20ల్లో 2,177 పరుగులు సాధించారు.

అన్ని ఫార్మాట్లలో కలిపి 104 స్టంపింగ్స్, 128 క్యాచులు అందుకున్నారు. 2017లో జరిగిన ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్ గెలవడంలో సారా కీలక పాత్ర పోషించారు.

మానసిక ఆరోగ్య సమస్యలతో 30 ఏళ్లకే ఆటకు దూరమయ్యారు. ఆ తర్వాత ఈస్ట్‌బౌర్న్‌లోని ఓ పాఠశాలలో క్రీడలు, లైఫ్ కోచ్‌గా పనిచేశారు. ససెక్స్ మెంటల్ హెల్త్, వెల్‌బీయింగ్ హబ్‌ను నెలకొల్పేందుకు కృషి చేశారు.

ఇంగ్లాండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ క్రికెట్ చరిత్రలో నూతన అధ్యయనానికి నాంది పలికారు. తొలిసారి పురుషుల క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యారు.

అయితే ఆమె మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించినా ఆశ్చర్యం లేదని గతంలో ఓసారి వెల్లడించారు.




