AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

D Gukesh: ఇలా మనోడు గెలిచాడో లేదో.. అలా మొదలైన ఫిక్సింగ్ ఆరోపణలు.. విచారణకు రష్యా చెస్ ఫెడరేషన్ డిమాండ్

D Gukesh: 18 ఏళ్ల వయస్సులో, ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా డి గుకేశ్ అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌పై విచారణ జరిపించాలని రష్యా చెస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది.

D Gukesh: ఇలా మనోడు గెలిచాడో లేదో.. అలా మొదలైన ఫిక్సింగ్ ఆరోపణలు.. విచారణకు రష్యా చెస్ ఫెడరేషన్ డిమాండ్
Fixing In World Chess Champ
Venkata Chari
|

Updated on: Dec 13, 2024 | 8:41 AM

Share

World Chess Championship: సింగపూర్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం ఫైనల్‌లో విజయం సాధించాడు. 18 ఏళ్ల గుకేశ్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే, ఇప్పుడు అతని చారిత్రాత్మక విజయంపై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. రష్యా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆండ్రీ ఫిలాటేవ్, ఫైనల్ మ్యాచ్‌లో లిరెన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయాడని ఆరోపించారు. దీనిపై అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఎఫ్‌ఐడీఈ) విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్దేశపూర్వకంగా ఓడిపోయాడంటూ ఆరోపణలు..

చైనా ఆటగాడు ఉద్దేశపూర్వకంగా ఓడిపోయాడంటూ రష్యా దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తోంది. ఉక్రేనియన్ చెస్ కోచ్ పీటర్ హెయిన్ నీల్సన్ ఈమేరకు ఓ ట్వీట్ చేశాడు. ‘ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంతో ప్రొఫెషనల్స్, చెస్ అభిమానులు సంతృప్తి చెందలేదు’ అంటూ అందులో ఉంది. గుకేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో, ఫలితాల రౌండ్ సమయంలో, చైనా ఆటగాడు కొన్ని ఎత్తుగడలు చేయడం సందేహాలను రేకెత్తిస్తుంది. FIDE దీన్ని విడిగా తీసుకోవాలి. డింగ్ లిరెన్ ఉన్న పరిస్థితిలో, ఫస్ట్ క్లాస్ ప్లేయర్ కూడా ఓడిపోవడం కష్టం. చైనీస్ ఆటగాడు ఉద్దేశపూర్వకంగా గేమ్‌లో ఓడిపోయినట్లు కనిపిస్తోంది. ఇది చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది.

చివరి రౌండ్‌లో విజయం..

చైనాకు చెందిన డింగ్ లిరెన్ గతేడాది ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా మళ్లీ దాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది అడుగుపెట్టాడు. సింగపూర్‌లో గత కొన్ని రోజులుగా భారత్‌కు చెందిన డి గుకేష్‌తో అతనికి గట్టి పోటీ ఉంది. 13 రౌండ్ల మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు తలా 2 విజయాలతో టై కాగా, 9 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఛాంపియన్‌షిప్ 14వ, చివరి రౌండ్ గురువారం డిసెంబర్ 12న జరిగింది. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో 18 ఏళ్ల గుకేశ్ చైనా గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి 7.56.5 తేడాతో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..