Serena Support: ఆమెకు ఓ హగ్ ఇవ్వాలని అనుకుంటున్నా.. నవోమీకి పెరుగుతున్న మద్దతు..
Serena Support To Naomi: మీడియా రెబల్ స్టార్‌గా మారిన జపాన్ ప్లేయర్ నవోమీ ఒసాకాకు మద్దతు పెరుగుతోంది. తాజాగా అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన మద్దతు తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చే ముందే
మీడియా రెబల్ స్టార్‌గా మారిన జపాన్ ప్లేయర్ నవోమీ ఒసాకాకు మద్దతు పెరుగుతోంది. తాజాగా అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన మద్దతు తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చే ముందే నాకు ఈ విషయం తెలిసింది. ఆమెకు ఓ హగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎలాంటి పరిస్థితో నాకు తెలుసు. నేను కూడా గతంలో ఇలాంటి పరిస్థితిని అనుభవించాను. పరిస్థితులను ఒక్కొక్కరు ఒక్కోలా ఫేస్ చేస్తారు. అందరూ ఒకేలా స్పందించాలని లేదు. ఈ పరిస్థితిని ఆమె ఎలా హ్యాండిల్ చేస్తోందో అలానే చేయనివ్వండి అని సెరెనా అన్నారు.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లను బాయ్‌కాట్ చేయడం వల్ల తనకు జరిమానా విధించడంపై నిరసన వ్యక్తం చేసిన నవోమీ.. ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీనిపై సోమవారం తన తొలి రౌండ్ మ్యాచ్ ముగిసిన తర్వాత సెరెనా స్పందించింది.
— NaomiOsaka大坂なおみ (@naomiosaka) May 26, 2021
ఇవి కూడా చదవండి : Shakeela Help: ఆకలి తీర్చే దేవతగా మారిన షకీలా..! కుక్ విత్ క్లౌన్ షో నుంచి సేవారంగంలోకి…