Chiranjeevi: ఊరికే అయిపోరు మెగాస్టార్! 3 లక్షల రివార్డ్‌తో పారాలింపిక్స్ విజేతను సత్కరించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించిన తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి‌ని ఘనంగా సత్కరించారు. అంతేకాదు ఆమెకు రూ. 3లక్షల చెక్ రివార్డుగా ఇచ్చి మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరారు.

Chiranjeevi: ఊరికే అయిపోరు మెగాస్టార్! 3 లక్షల రివార్డ్‌తో పారాలింపిక్స్ విజేతను సత్కరించిన చిరంజీవి
Chiranjeevi, Deepti Jeevanj
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2025 | 9:03 PM

పారా ఒలింపిక్స్ విజేత జీవాంజి దీప్తిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఇటీవల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో దీప్తికి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన జీవాంజీ దీప్తి ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ అమ్మాయికి శాలువా కప్పి సన్మానించారు. ఆ తర్వాత రూ. 3 లక్షల చెక్ కూడా అందజేసి ఆటలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. కాగా పిలిచిన వెంటనే ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవికి ఇండియ‌న్ నేష‌న‌ల్ బాడ్మింట‌న్ టీమ్‌ చీఫ్ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

‘ఇటీవ‌ల మ‌న తెలుగు రాష్ట్రాల నుంచి పారా అథ్లెట్ ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించిన అమ్మాయి దీప్తి జీవాంజి. వ‌రంగ‌ల్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన ఆమె దేశానికెంతో పేరుని తెచ్చారు. ఒలింపిక్స్‌లో మెడ‌ల్ సాధించిన సంద‌ర్భంగా మీకేం కావాల‌ని నేను ఆమెను అడిగిన‌ప్పుడు, చిరంజీవిగారిని క‌ల‌వాల‌నుంద‌ని చెప్పారు.ఇటీవ‌ల నేను చిరంజీవిగారిని ఓ సంద‌ర్భంలో క‌లిసిన‌ప్పుడు దీప్తి జ‌వాంజి గురించి చెప్పాను. ఆయ‌న చాలా గొప్ప మ‌న‌సుతో స్పందించారు. చాలా పెద్ద అచీవ్‌మెంట్ చేసిన‌ప్పుడు, ఆమె రావ‌టం కాదు, నేను అకాడ‌మీకి వ‌స్తాన‌ని అన్నారు. అన్న‌ట్లుగానే చిరంజీవిగారు మా అకాడ‌మీకి వ‌చ్చి, అక్క‌డున్న పిల్ల‌లంద‌రినీ క‌లిశారు. రెండు గంట‌ల పాటు అక్క‌డే గ‌డిపారు. అలాగే ప్ర‌తీ ఒక్క ప్లేయ‌ర్‌ని ఇన్‌స్పైర్ చేసే విధంగా మాట్లాడారు. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ను దీప్తికి అందించటం అనేది మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇది మా స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కి చిరంజీవి ఇచ్చిన గొప్ప గౌర‌వంగా నేను భావిస్తాను. ఈ ఇన్‌స్పిరేష‌న్‌తో చాలా మంది మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తార‌ని నేను భావిస్తున్నాను’ అని తన ప్రకటనలో తెలియజేశాడు గోపీచంద్.

ఇవి కూడా చదవండి

దీప్తిని సన్మానిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి