Tollywood: ఆ స్టార్ హీరో నన్ను వాడుకుని వదిలేశాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఫేమస్ హీరోయిన్. 17 ఏళ్లకే నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. కానీ ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొని కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇప్పటికీ వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తనకంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో వార్తలు వినిపించాయి. గతంలో ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆమె మరెవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ తరగని అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. కుర్రహీరోయిన్లకు సైతం పోటీగా ఆశ్చర్యపోయే ఫిట్నెస్ లుక్‌తో కనిపిస్తుంది. హిందీలో ఎన్నో సినిమాల్లో నటించింది శిల్పా శెట్టి. తెలుగులో వెంకటేశ్ సరసన సాహసవీరుడు సాగరకన్య సినిమాలో నటించింది.
ఇదిలా ఉంటే గతంలో ఓ స్టార్ హీరో గురించి శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. టాప్ హీరోయిన్ గా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో శిల్పా ప్రేమలో ఉందనే టాక్ నడిచింది. వీరిద్దరు కలిసి మై ఖిలాడి తూ అనారి చిత్రంలో నటించారు. 1994లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు రిలేషన్ షిప్లో ఉన్న వీరిద్దరు 2000లో మానస్పర్థలతో విడిపోయారు. అయితే శిల్పా తో విడిపోయిన మరుసటి ఏడాది అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నాడు.
గతంలో బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న శిల్పా శెట్టి అక్షయ్ కుమార్ తో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. తనను ప్రేమిస్తూనే హీరోయిన్ ట్వింకిల్ ఖాన్నాతో ప్రేమాయణం నడిపించాడని.. తనను వాడుకుని వదిలేశాడని తెలిపింది. ప్రేమ పేరుతో తనను వాడుకున్నాడని.. మరో హీరోయిన్ కోసం తనను వదిలేశాడని తెలిపింది. శిల్పా శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మళ్లీ వైరలవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది శిల్పా శెట్టి.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.