Gautam Gambhir: గంభీర్ పోస్ట్ ఊస్టింగ్! టీమిండియా కొత్త కోచ్‌గా హైదరాబాదీ క్రికెటర్.. ఎప్పటినుంచంటే?

సిడ్నీ టెస్టు తొలిరోజే టీమిండియా విఫలమైంది. పేలవమైన ఫామ్ కారణంగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. కానీ టీమిండియా ఆటతీరు మాత్రం మారలేదు. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు భారత బ్యాటర్లు మోకరిల్లారు. దీంతో టీమ్ ఇండియా తొలి రోజే వెనుకబడినట్లు కనిపిస్తోంది. దీంతో పాటు గౌతమ్ గంభీర్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

Gautam Gambhir: గంభీర్ పోస్ట్ ఊస్టింగ్! టీమిండియా కొత్త కోచ్‌గా హైదరాబాదీ క్రికెటర్.. ఎప్పటినుంచంటే?
Gautam Gambhir
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2025 | 4:46 PM

బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా భారీస్కోరు చేస్తుందనిపించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. 185 పరుగులకే భారత జట్టు చాప చుట్టేసింది. రిషబ్ పంత్ అత్యధికంగా 40 పరుగులు చేశాడు. ఇతర బ్యాటర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. నితీష్ కుమార్ రెడ్డి ఖాతా కూడా తెరవలేకపోయారు. బోలాండ్ 4, స్టార్క్ 3, కమిన్స్ 2, లియాన్ 1 వికెట్లు తీసుకున్నారు. దీంతో తొలి రోజు నుంచి ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ టెస్టు మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోతే గౌతమ్ గంభీర్ స్థానం కూడా ప్రమాదంలో పడినట్లే. మీడియా కథనాల ప్రకారం, ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రధాన కోచ్ పదవి నుంచి గౌతమ్ గభీర్‌ను తొలగించే అవకాశం ఉంది. అతని స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ వచ్చే అవకాశం ఉంది.

గౌతమ్‌ గంభీర్‌ టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీమ్ లో ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. గౌతీ కోచింగ్‌లో టీమ్ ఇండియా ఆట తీరు బాగా దిగజారిపోయింది. మొదట శ్రీలంకలో వన్డే సిరీస్, తర్వాత న్యూజిలాండ్‌తో 3-0తో టెస్టు, ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌ కూడా కోల్పోవాల్సి వచ్చింది. నివేదికల ప్రకారం, గంభీర్, కెప్టెన్ రోహిత్ మధ్య సత్సంబంధాలు లేవనే టాక్ కూడా ఉంది. వీరి ఆలోచనా విధానం వల్లనే టీమ్ ఇండియా వరుసగా ఓడిపోతోందని అంటున్నారు. గౌతమ్ గంభీర్ శిక్షణ టీమిండియా ఆటగాళ్లకు నచ్చట్లేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో దీని ప్రభావం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా చేరుతుందా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఒకవేళ సిడ్నీ టెస్టులో ఓడిపోతే, టీమిండియా జూన్ నెలలో ఇంగ్లండ్ లో నేరుగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీవీఎస్ లక్ష్మణ్‌కు టెస్టు జట్టు కోచ్‌ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతిగా ఉన్నారు. ఇప్పటికే అతను టీ20ల్లో టీమ్ ఇండియాకు ప్రధాన కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ ఈ హైదరాబాదీ క్రికెటర్ నే ప్రధాన కోచ్ గా చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి