Koneru Humpy: ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు కోనేరు హంపి అర్హత.. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ రేసులో నిలిచేనా.
Koneru Humpy: తెలుగు చెస్ తేజం కోనేరు హంపి 2022లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ రేసులో నిలిచారు. ఈ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు కోనేరు...
Koneru Humpy: తెలుగు చెస్ తేజం కోనేరు హంపి 2022లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ రేసులో నిలిచారు. ఈ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌కు కోనేరు హంపి అర్హత సాధించించారు. గతేడాది మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ హంపి 293 పాయింట్లతో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలవడంతో ఆమెకు క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ ఖరారైంది. ఇక హంపితోపాటు కాటరీనా లాగ్నో (రష్యా–280 పాయింట్లు), గత ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన అలెక్సాండ్రా గోర్యాచ్‌కినా (రష్యా) కూడా క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించారు. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో జరిగే క్యాండిడేట్స్ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది పాల్గొంటారు. ఈ టోర్నీలో విజేగా నిలిచిన వారు 2022 ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జూ వెన్‌జున్ (చైనా)తో తలపడనున్నారు. ఇక గ్రాండ్ ప్రి సిరీస్‌లోని నాలుగు టోర్నీలలో చివరిదైన జిబ్రాల్టర్ టోర్నీ బుధవారం ముగిసింది. ఈ టోర్నీలో హంపి ఆడకపోయినా గతంలో ఆమె ఆడిన రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో అద్భుత ప్రదర్శన చేశారు. స్కోల్కోవాలో జరిగిన టోర్నీతో పాటు, మొనాకో టోర్నీలో హంపి విజేతగా నిలిచారు. అయితే.. కరోనా కారణంగా.. హంపి జిబ్రాల్టర్ టోర్నీకి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో బరిలోకి దిగిన నానా జాగ్‌నిద్జె (జార్జియా), అనా ముజిచుక్ (ఉక్రెయిన్), కాటరీనా లాగ్నో (రష్యా)లలో ఇద్దరు టాప్–3లో నిలిచి ఉంటే హంపికి క్యాండిడేట్స్ టోర్నీ బెర్త్ కోసం కొంతకాలం వేచి చూడాల్సి వచ్చేది. అయితే ఈ ముగ్గురిలో కాటరీనా మాత్రమే టాప్–3లో నిలువడంతో హంపికి బెర్త్ ఖరారైంది.
Also Read: భారత్ కోసం మేమున్నామంటున్న ఆసీస్ ఆటగాళ్లు.. మన దేశం కోసం ఆ దేశంలో విరాళ సేకరణ..
లెక్క మారింది వరల్డ్ కప్‌లో 14 జట్లు.. టీ20 కప్‌లో 20 జట్లు…ఫ్యూచర్ ప్లాన్ ప్రకటించిన ఐసీసీ..