లెక్క మారింది వరల్డ్ కప్‌లో 14 జట్లు.. టీ20 కప్‌లో 20 జట్లు…ఫ్యూచర్ ప్లాన్ ప్రకటించిన ఐసీసీ..
ICC T20 World Cup: ఐసీసీ పలు భారీ ఫ్యూచర్ ప్లాన్‌ను ప్రకటించింది. వచ్చే ఎనిమిదేళ్ల కాల చక్రానికి సంబంధించి ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ ప్రణాళికను వెల్లడించింది.
ఐసీసీ పలు భారీ ఫ్యూచర్ ప్లాన్‌ను ప్రకటించింది. వచ్చే ఎనిమిదేళ్ల కాల చక్రానికి సంబంధించి ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ ప్రణాళికను వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC).. 2024 నుంచి ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ప్రణాళికను ఓకే చేసింది. ప్రస్తుత తరహాలోనే టీ20 ప్రపంచకప్‌ను ఇకపైనా రెండేళ్లకోసారి నిర్వహించాలని కీలక నిర్ణయం కూడా ఇందులో ఉంది. అయితే 2027 ఎడిషన్ నుంచి 50 ఓవర్ల వరల్డ్‌కప్‌ను 14 జట్లతో జరపుతున్నట్లుగా తెలిపింది. ప్రస్తుతం రెండు ఎడిషన్లుగా జరుగుతోన్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీల స్థానంలో నాలుగు ఎడిషన్లు జరపాలని పాలకమండలి నిశ్చయించింది.
2024-31 వరకు టీ20, 50 ఓవర్ల ప్రపంచకప్‌ల ఎనిమిదేళ్ల ఫ్యూచర్స్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్‌కు సంబంధించి.. షెడ్యూల్‌ను ఐసీసీ ఆమోదించింది. పురుషుల క్రికెట్లో ఛాంపియన్స్ ట్రోఫీని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.