AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash to Donate: సినీ కార్మికుల ఖాతాల్లో నేరుగా డబ్బులు.. కోటిన్నర ఆర్ధిక సాయం అందించిన KGF స్టార్ యష్

KGF Superstar Yash: రెక్కాడితే కానీ డొక్కాడని సినీ కార్మికులకు అండగా కన్నడ సూపర్ స్టార్ యష్ ముందుకు వచ్చారు. ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున మొత్తం ఒకటిన్నర కోటి రూపాయలను నేరుగా  వారి బ్యాంక్ ఖాతాల్లో...

Yash to Donate: సినీ కార్మికుల ఖాతాల్లో నేరుగా డబ్బులు.. కోటిన్నర ఆర్ధిక సాయం అందించిన KGF స్టార్ యష్
Kannada Superstar Kgf Yash
Sanjay Kasula
|

Updated on: Jun 02, 2021 | 9:39 AM

Share

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ ప్రభావం చాలా పరిశ్రమలపై పడింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీపై భారీగా పడుతోంద. దీంతో ఆ వ్యవస్థలో పని చేస్తున్న వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నాయి. ఇలా వారిని ఆదుకునేందుకు  గొప్ప మనసు చాటుకున్నాడు కనడ సూపర్ స్టార్ KGF స్టార్ యష్.. ఇలా ఇబ్బందులు పడుతున్న మూడు వేల కుటుంబాలకు అండగా నిలిచాడు యష్. ఏకంగా వారి కోసం కోటిన్నర విరాళం ప్రకటించాడు.

ఈ కష్టకాలంలో రెక్కాడితే కానీ డొక్కాడని సినీ కార్మికులకు అండగా కన్నడ సూపర్ స్టార్ యష్ ముందుకు వచ్చారు. సినిమా షూటింగ్స్ జరక్కపోవడంతో సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల కార్మికులు కష్టాలు పడుతున్నారు. రోజువారీ వేతనాలతో జీవించేవారి పరిస్థితి మరీ దయనీయమైంది. దీంతో హీరో యష్ కన్నడ సినీ కార్మికుల కోసం భారీ మొత్తంలో విరాళం అందిచాడు.

కన్నడ సినీ ఇండస్ట్రీలో 21 విభాగాల్లో పనిచేస్తున్న 3000 మంది కార్మికులకు ఆర్ధికంగా ఆదుకుంన్నాడు. ఒక్కొక్కరికి రూ. 5వేల చొప్పున మొత్తం ఒకటిన్నర కోటి రూపాయలను నేరుగా  వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నాడ.  ఇదిలావుంటే.. నీల్ దర్శకత్వంలో యష్ చేస్తున్న ‘కెజియఫ్-2’ అన్ని పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది.

ఇవి కూడా చదవండి: అమ్మోనా కోడలా… బతికిపోతావా..! కోడలిని కౌగిలించుకున్న అత్త..! కట్ చేస్తే..!

Telangana Formation Day: రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సర్వం సిద్ధం.. రాజన్న సిరిసిల్లలో జెండా ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్

Petrol Diesel Price Today: ఏపీలో రూ.100 దాటిన పెట్రోల్ ధర.. మరి మన నగరంలో ఎలా ఉందో తెలసుకోండి..