AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మోనా కోడలా… బతికిపోతావా..! కోడలిని కౌగిలించుకున్న అత్త..! కట్ చేస్తే..!

Atta Behaves Like Sadist: మనందరికి ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏంటో విన్నాం.. కానీ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ అత్త తనకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత కోడలికి అంటించాలని ప్లాన్..

అమ్మోనా కోడలా... బతికిపోతావా..! కోడలిని కౌగిలించుకున్న అత్త..! కట్ చేస్తే..!
She Hugged His Daughter In
Sanjay Kasula
|

Updated on: Jun 02, 2021 | 7:57 AM

Share

మనందరికి ధృతరాష్ట్ర కౌగిలి అంటే ఏంటో విన్నాం.. కానీ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ అత్త తనకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత కోడలికి అంటించాలని ప్లాన్ చేసింది. కరోనాతో తాను చనిపోతే కోడలు ఎలా బతుకుతుందని అనుకుందో ఏమో.. తనకు వచ్చిందని తెలిసిన వెంటనే కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది.

ఈ ఘటన  సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇదే గ్రామంకు చెందిన  ఓ మహిళకు కామారెడ్డి జిల్లాలోని నేమిలీగుత్త తండా వాసితో మూడేళ్ళ కింద పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల కింద ఒడిశా వెళ్ళాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవరుగా పని చేస్తున్నాడు.  అత్తతో కలిసి ఇక్కడ ఉంటోంది. అంతా ప్రశాంతంగా సాగుతోంది. ఇంతలో సెకెండ్ వేవ్ గ్రామాలను కూడా తాకింది. ఎక్కడ చూసిన కోవిడ్ బాధితులే.. ఇలా ఆ ఇంటిని కూడా తాకింది.

అయితే గత 5 రోజుల క్రితం  అత్తకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అత్త హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు సామాజిక దూరం పాటిస్తు అత్తకు అన్ని స్వపర్యలు చేస్తోంది. ఏం జరిగిందో ఏమ తనకు సేవ చేస్తున్న కోడిలి పట్ల కుట్ర పెంచకుంది అత్త. సామాజిక దూరం పాటిస్తున్న కోడలిని చూసి అత్త భరించలేకపోయింది. ఇంకేముంది తన శాడిజం ప్రదర్శించింది. కోడలిని తరచూ కౌగిలించుకునేదట. ఇలా అత్త నుంచి కోవిడ్ కోడలికి కూడా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకుంది. దీంతో కోడలికి కూడా కోవిడ్ పాజిటివ్ అని తేలింది.  దీంతో చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా ఆమెను బయటకు నెట్టేసింది. ఈ దారుణాన్ని గ్రహించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా అత్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు అధికారులు. ప్రస్తుతం కోడలు, అత్త హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి: Land Resurvey: ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు.. గ్రామాల్లో పట్టా భూముల రీసర్వేకు శ్రీకారం

Telangana Formation Day: రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సర్వం సిద్ధం.. రాజన్న సిరిసిల్లలో జెండా ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్