Land Resurvey: ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు.. గ్రామాల్లో పట్టా భూముల రీసర్వేకు శ్రీకారం

Land Resurvey: ఏపీ సర్కార్ మరింత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వాలని నిర్ణయించి సర్వే సెటిల్‌మెంట్‌, లాండ్‌ రికార్డ్స్‌...

Land Resurvey: ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు.. గ్రామాల్లో పట్టా భూముల రీసర్వేకు శ్రీకారం
Ysr Jagananna Saswatha Bhoo
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 02, 2021 | 6:52 AM

ఏపీ సర్కార్ మరింత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇవ్వాలని నిర్ణయించి సర్వే సెటిల్‌మెంట్‌, లాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌  ఓ ప్రకటనలో విడుదల చేశారు. గత డిసెంబరు 21న రాష్ట్ర వ్యాప్తంగా రీ సర్వే ప్రారంభమైందని, 17,500 గ్రామాలు, 110 పట్టణ ప్రాంతాల్లో రీ సర్వే ద్వారా యాజమాన్య హక్కుల నిర్ధారణ ప్రక్రియ చేపట్టినట్టు  తెలిపింది.  “వైఎస్సార్‌ జగనన్న భూ రక్ష- శాశ్వత భూ హక్కు” పథకం ద్వారా ఆధునిక టెక్నాలజీతో ఈ రీసర్వే ప్రక్రియ చేపట్టినట్లు వారు ప్రకటనలో వెల్లడించారు. తొలివిడతగా రెవెన్యూ డివిజెన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాల్లో పైలెట్‌ ప్రాజెక్టు ప్రక్రియ ప్రారంభమైందని, క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన వచ్చిన తర్వాత మండలానికి ఒక గ్రామం చొప్పున 650 గ్రామాల్లో రీ సర్వే చేస్తామని వివరించారు.

ఇప్పటి వరకు 51 గ్రామాల్లోని 63,433 ఎకరాలకు సంబంధించిన డ్రోన్‌ ఇమేజెస్‌ ప్రింటింగ్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. 40 గ్రామాలకు సంబంధించి సరిహద్దులు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల సర్వే ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన గ్రామాల్లో డ్రోన్‌ ప్లైయింగ్‌ జరుగుతుందని, సర్వే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఇక కొత్త సర్వే విధానంపై 10,180 మంది క్షేత్రస్థాయి సిబ్బంది, 275 మంది మధ్యస్థాయి సిబ్బంది సర్వే ఆఫ్‌ ఇండియాలో సాఫ్ట్‌వేర్‌పై వీరంతా ప్రత్యేక శిక్షణ పొందినట్టు వివరించారు. 200 రోవర్‌లకు మొదటి విడతగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని అన్నారు ఇప్పటి వరకు 75 రోవర్లను జిల్లాలకు పంపిణీ చేశామన్నారు. సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు సిద్ధార్థజైన్‌ తెలిపారు.

అయితే గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వందేళ్లలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా భూముల రీసర్వే చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు హామీ ఇచ్చారు.  2023నాటికి సర్వే పూర్తి చేసి స్పష్టమైన రికార్డులు నిర్వహిస్తామన్నారు. ఇకపై భూ వివాదాలకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పరిష్కార వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు

ఇవి కూడా చదవండి :  Maruti Suzuki May 2021 Sales: లాక్‌డౌన్ ఎఫెక్ట్…భారీగా తగ్గిపోయిన మారుతి సుజుకి కార్ల సేల్స్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే