Dowry Murder: అడిగినంత కట్నం తీసుకురాలేదని భార్యపై ఆగ్రహించిన భర్త.. చివరకు ఏం చేశాడంటే..
Dowry Murder: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరకట్నం విషయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీతో...
Dowry Murder: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరకట్నం విషయంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. ఘజియాబాద్‌లోని సిహానీ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సిహాని గ్రామానికి చెందిన కుల్దీప్ అలియాస్ మింటూతో ముజఫర్ నగర్ జిల్లాలోని ఉపవాలి గ్రామానికి చెందిన సారికతో గత ఏడాది ఫిబ్రవరి నెలలో వివాహం జరిగింది. అయితే, కట్నం తగినంత తీసుకురాలేదనే ఆగ్రహంతో మింటూ తన భార్యను నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. అయితే, ఈ వేధింపులు తాలలేక నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేశారు.
ఇదిలాఉంటా.. మంగళవారం సాయంత్రం సమయంలో కట్నం విషయంలోనే మింటూ తన భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఘర్షణ తీవ్రం అవడంతో ఆగ్రహానికి గురైన మింటూ తుపాకీతో తన భార్యపై కాల్పులు జరిపాడు. దాంతో సారికా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. భార్యను హతమార్చిన మింటూ తన తల్లిదండ్రులతో కలిసి పరార్ అయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా, మింటూపై గతంలోనే హత్య కేసు ఉందని, ఈ కేసులో అతను అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవించాడని పోలీసు అధికారులు తెలిపారు. తాజాగా అతనిపై హత్యానేరంతో పాటు ఆయుధ నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్ల జిల్లా పోలీసు అధికారి అగర్వాల్ వెల్లడించారు.
Also read: