AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Donation: కరోనా బాధితులకు అండగా యువరాజ్.. దేశ వ్యాప్తంగా ఆక్సీజన్ బెడ్స్ ఏర్పాటుకు సిద్ధమంటూ ప్రకటన..

Yuvraj Donation: కరోనా బాధితులకు అండగా నిలిచాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఆక్సీజన్, బెడ్స్ దొరక్క ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో..

Yuvraj Donation: కరోనా బాధితులకు అండగా యువరాజ్.. దేశ వ్యాప్తంగా ఆక్సీజన్ బెడ్స్ ఏర్పాటుకు సిద్ధమంటూ ప్రకటన..
Yuvi
Shiva Prajapati
|

Updated on: Jun 02, 2021 | 8:54 AM

Share

Yuvraj Donation: కరోనా బాధితులకు అండగా నిలిచాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఆక్సీజన్, బెడ్స్ దొరక్క ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో.. కీలక ప్రకటన చేశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు గానూ దేశ వ్యాప్తంగా వెయ్యి పడకలను ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. యువరాజ్ నడుపుతున్న ఫౌండేషన్ యువీకెన్ ఆధ్వర్యంలో ఈ బెడ్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపాడు. యువీకెన్‌తో పాటు వన్‌డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఆక్సిజన్, వెంటిలేటర్‌తో కూడిన బెడ్స్‌ను దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్‌సీఆర్, హర్యానా, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు యువీకెన్ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమయానికి ఆక్సీజన్ అందక దేశ వ్యాప్తంగా అనేక మంది చనిపోయారు. దాంతో ఆక్సీజన్ సప్లయ్‌పై ప్రభుత్వాలు దృష్టి సారించాయి. మరోవైపు సినీ, స్పోర్ట్స్, రాజకీయ ప్రముఖులు సైతం ఆక్సీజన్ సప్లయ్, ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లు సహా ఇతర వైద్య పరికరాలను విరాళాలుగా అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యువరాజ్ కూడా కరోనా బాధితులకు బాసటగా నిలిచాడు.

Also read:

Poco M3 Pro 5G launch: అదిరిపోయే ఫీచర్లో పోకో ఎం3 ప్రో స్మార్ట్‌ఫోన్‌.. ఇండియాలో అందుబాటులోకి ఎప్పుడంటే..