Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన షర్మిల.. ఇవాళ సీఎం కేసీఆర్ ఇలాకాలో పర్యటన

షర్మిల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో పర్యటిస్తున్నారు..

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన షర్మిల..  ఇవాళ సీఎం కేసీఆర్ ఇలాకాలో పర్యటన
YS Sharmila
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 02, 2021 | 9:00 AM

YS Sharmila Gajwel tour : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైయస్ షర్మిల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. “వెన్నుచూపని ధైర్యంతో, మొక్కవోని సంకల్పంతో పోరాడి 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకున్న రోజు. ప్రత్యేక రాష్ట్రం సిద్దించిన రోజు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.” అంటూ ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ఇలా ఉండగా, ఇటీవలే తెలంగాణ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో పర్యటిస్తున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గంలో షర్మిల.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారికి భరోసానిచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ ఉదయం గన్‌పార్క్ దగ్గర నివాళులర్పించి అనంతరం షర్మిల గజ్వేల్‌కు బయలుదేరనున్నారు. షర్మిల పర్యటన కోసం ఆమె అనుచరులు, అభిమానులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గజ్వేల్ లో ఏం మాట్లాడతారన్నది తెలుగునాట ఆసక్తికరంగా మారింది.

కాగా, నేటి ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో షర్మిల.. కేసీఆర్‌తో పాటు.. హరీశ్ రావుపై కూడా ఫోకస్ చేస్తారని సమాచారం. తెలంగాణలో పార్టీ ఏర్పాటు పెడతానని ప్రకటించిన ఆమె జిల్లాల వారీగా వైయస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అనంతరం ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 9వ తేదీన తొలి బహిరంగ సభ పెట్టారు. తెలంగాణ నిరుద్యోగులకు అండగా కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు షర్మిల మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టేందుకు పూనుకున్నారు.

అయితే,  పోలీసులు ఒక్కరోజు మాత్రమే దీక్షకు అనుమతి ఇవ్వడంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ నుంచి రెండు రోజుల దీక్షను పూర్తి చేశారు షర్మిల. ఇక, దివంగత సీఎం వైఎస్ఆర్ పుట్టిన తేదీ జూలై 8న కావడంతో అదేరోజు పార్టీ ఏర్పాటు ప్రకటన చేయాలని షర్మిల నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

Read also : Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి తీరానికి కొట్టుకు వచ్చిన ఇద్దరు యువతుల మృతదేహాలు.. !