AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmia : ఉమ్మడి మెదక్ జిల్లాలో షర్మిల పర్యటన.. ఎంతమంది నిరుద్యోగులు చనిపోతే ఉద్యోగాలిస్తారో చెప్పాలని డిమాండ్

నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానం. 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారు..

YS Sharmia : ఉమ్మడి మెదక్ జిల్లాలో షర్మిల పర్యటన..  ఎంతమంది నిరుద్యోగులు చనిపోతే ఉద్యోగాలిస్తారో చెప్పాలని డిమాండ్
Ys Sharmila
Venkata Narayana
|

Updated on: Jun 02, 2021 | 4:52 PM

Share

YS Sharmia Gajwel tour : తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు వైయస్ షర్మిల. “ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు.. ఇవ్వాళ అవే ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ లో నిరుద్యోగులు చావే దిక్కు అనుకుంటున్నారు. నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానం. 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారు. వయసు పెరిగిపోవడంతో ఉద్యోగాలు రాక ఎంతో మంది చనిపోతున్నారు.” అని షర్మిల తెలంగాణలో నిరుద్యోగులు ఎదుర్కొంటోన్న సమస్యలపై గళమెత్తారు. ఎంత మంది చనిపోతే ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వెంటనే లక్ష 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆమె తెలంగాణ సర్కారుని కోరారు. నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ మోసం చేశారన్న ఆమె, కరోనాని రాజీవ్ ఆరోగ్య శ్రీ లో చేర్చాలన్నారు.

“కేంద్ర ప్రభుత్వం యొక్క ‘ఆయుష్ మాన్ భరత్’ దిక్కుమాలిన పథకం దిక్కుమాలిన పథకం అని కేసీఆర్ అన్నారు.. అటువంటి పథకం తో ఎలా కలుస్తారు..?” అంటూ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఇవాళ షర్మిల ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తూప్రాన్ మండలం నాగుల పల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే అంశంపై రైతుల నుంచి షర్మిల ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న సమయంలో.. తరుగు పేరిట మరో కేజీ ఎక్కువ తీస్తున్నారని రైతన్నలు అవేదన వ్యక్తం చేశారు.

రైతు బందు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అన్న రైతులు.. పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పించండిని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ‘సకాలంలో ధాన్యం కొంటలేరు.. ధాన్యం కొన్నా సకాలం లో డబ్బులు ఇస్తలేరు’. అని రైతులు తమ సమస్యల్ని షర్మిలతో చెప్పారు. అటు, ఇటీవల కరోనాతో ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయిన కుటుంబాలను షర్మిల పరామర్శించి, వారికి సాయం అందించారు.

Read also : UP’s Gonda : సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం, ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి, 14 మందికి తీవ్ర గాయాలు