UP’s Gonda : సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం, ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి, 14 మందికి తీవ్ర గాయాలు
కూలిపోయిన పైకప్పు కింద చిక్కుకున్న క్షతగాత్రుల్లో కొందర్ని స్థానికంగా ఉన్న గ్రామస్తులు రక్షించి..
Gas cylinder blast in UP’s Gonda : ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక రెండంతస్తుల భవనంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా 7 మంది మరణించారు. సిలిండర్ పేలుడు కారణంగా రెండు అంతస్తుల భవనం పైకప్పు కుప్ప కూలి పోయింది. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిపోయిన పైకప్పు కింద చిక్కుకున్న క్షతగాత్రుల్లో కొందర్ని స్థానికంగా ఉన్న గ్రామస్తులు రక్షించి నవాబ్‌గంజ్‌లోని ప్రజారోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై గోండా పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ “ఇంటి పైకప్పు కూలి 14 మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు మరణించారు.” అని పేర్కొన్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Read also : Amazon Prime : యువ కస్టమర్లకు అమెజాన్ బంపరాఫర్.. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మీద 50 శాతం క్యాష్ బ్యాక్. !