వైట్ పేపర్‌పై సంతకం చేసి అప్పు తీసుకుని.. తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే..! ఏం చేయాలి..?

అప్పు అంటే తిరిగి ఇచ్చే షరతుతో అడిగి తీసుకొనే ధనం. అప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది అభివృద్ధికి దోహదం చేస్తుంది. అప్పు తీసుకొనేవారు అప్పు ఇచ్చిన వ్యక్తికి వ్రాసి ఇచ్చే నోటును....

వైట్ పేపర్‌పై సంతకం చేసి అప్పు తీసుకుని.. తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే..! ఏం చేయాలి..?
Civil Court
Follow us

|

Updated on: Jun 02, 2021 | 1:15 PM

అప్పు అంటే తిరిగి ఇచ్చే షరతుతో అడిగి తీసుకొనే ధనం. అప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది అభివృద్ధికి దోహదం చేస్తుంది. అప్పు తీసుకొనేవారు అప్పు ఇచ్చిన వ్యక్తికి వ్రాసి ఇచ్చే నోటును ప్రామిసరి నోట్ అంటారు. అప్పు ఇచ్చినందుకు వచ్చే ప్రతిఫలాన్ని వడ్డీ అంటారు. కొంత సమయంలో తిరిగి చెల్లించే వడ్డీ లేని రుణాన్ని చేబదులు అంటారు. ఇదిలావుంటే… ఒకరికొకరు సహాయపడటం మానవ ప్రవర్తనలో భాగం. ఇందులో మాట సహాయం.. ఆర్థిక సహాయం ఇవి మానవ సంబంధాల్లో చాలా ముఖ్యమైనవి.

ఇక బ్యాంక్ ఇచ్చే డబ్బును రుణం అంటారు. క్రెడిట్ స్కోర్ చూసిన తర్వాతే బ్యాంకులు ఎవరికైనా రుణం అందిస్తాయి. ఇలా కాకుండా బంగారం లేదా ఏదైనా ఆస్తి హామీగా పెట్టుకుని తనఖా రూపంలో అప్పు ఇస్తాయి. అదే విధంగా, చాలా మంది భూమిని లేదా ఇంటికి సంబంధించిన పత్రాలను తనఖా పెట్టడం ద్వారా డబ్బు ఇస్తుంటారు.

ఇలా కాకుండా… స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు మొదలైన వారికి నమ్మకంపై (ట్రస్ట్‌పై) మాత్రమే రుణాలు ఇస్తుంటారు. ఇలాంటి చాలా సందర్భాల్లో రుణం స్టాంపు పేపర్‌ మీద కాకుండా సాదా కాగితంపై సంతకాన్ని తీసుకుని ఆర్ధిక సహాయం చేస్తుంటారు. ఇలా అరువు తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు కొందరు ఇబ్బందులు పెడుతుంటారు. ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్యలో ఉన్న నమ్మకం వీగి పోతుంది.

ఇప్పుడు మనం అసలు విషయంకు వచ్చేద్దాం… ఎవరైనా మీ నుంచి సాదా కాగితంపై సంతకం చేసి డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తే… ఏదైన పరిష్కారం ఉందా..? ఇలాంటి సమయంలో ఎలాంటి పరిష్కారం ఉంది..? నిపుణులు ఏమంటున్నారు..? ఒక సారి మనం పరిశీలిద్దాం..ఇలాంటి వారి నుంచి డబ్బులు తిరిగి పొందేందుకు కొంత పోరాడాల్సి ఉంటుంది.

ఇలాంటి వివాదం వచ్చినప్పుడు ఏం చేయాలో ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తు్న్న శుభం భారతీ టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. చాలా వివరాలను అందించారు. సాదా కాగితం లేదా స్టాంప్ పేపర్.. ఈ రెండింటిలో ఎక్కడైన రుణగ్రహీత సంతకం ఉంటే అప్పుడు మీరు మీ డబ్బు కోసం న్యాయ పోరాటం చేయవచ్చు.

మీ రుణగ్రహీత నుండి సంతకాన్ని పొందడం ద్వారా మీరు రుజువు చేసినప్పటికీ, మీ ఇద్దరి మధ్య వ్రాతపూర్వక ఒప్పందం జరిగిందని అర్థం. అంటే మీ డబ్బుకు రుణగ్రహీత నుంచి తీసుకున్న రశీదుగా భావించాల్సి ఉంటుంది.

సివిల్ కోర్టులో కేసు…

వ్రాతపూర్వక ఒప్పందం ఉన్నప్పటికీ ఈ ఒప్పందాన్ని మీ రుణగ్రహీత అంగీకరించడానికి నిరాకరిస్తే… మీరు అతనిపై సివిల్ కోర్టులో కేసు పెట్టవచ్చు. ఇలాంటి కార్యకలాపాలను సివిల్ లేదా సివిల్ ప్రొసీడింగ్స్ అంటారు.

సివిల్ కోర్టులో సివిల్ కేసులు మాత్రమే నమోదు చేయబడతాయి. మీ కేసులో తీర్పు ఇవ్వడానికి ఎన్ని రోజుల్లో అనేది మాత్రం కోర్టుపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయం మీకు అనుకూలంగా వస్తే, మీ రుణగ్రహీత మీ డబ్బును తిరిగి ఇవ్వాలి. అయితే, ఇందులో అతనికి జైలు లేదా పెద్ద శిక్ష కూడా పడవచ్చు.

పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు లేదా కోర్టులో ఫిర్యాదు కేసు!

ఎవరో చెప్పినదానిపై ఆధారపడి చాలా మంది ముందు రుణాలు ఇస్తుంటారు. అంటే, మీరు సాదా కాగితంపై సంతకం చేయలేదని..రాసిన కాగితంను చదవకుండా రుణం ఇచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అతను డబ్బు తిరిగి ఇవ్వడం లేదు.. అప్పుడు ఏమి చేయాలి?

ఈ పరిస్థితిలో రుణం ఇచ్చే సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను ఇద్దరిని 2 సాక్షులను మీరు సమర్పించవచ్చు. మీరు మీ సమీపంలోని ఏదైనా పోలీస్ స్టేషన్‌లో వారిపై రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం నేరపూరితంగా మారుతుంది.

డబ్బు తిరిగి ఎలా పొందాలి?

కోర్టులో నేరం రుజువైతే రుణగ్రహీత శిక్ష పడుతుంది. అంతే కాదు అరెస్టు కూడా చేయవచ్చు. కోర్టు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయితే.. మీ డబ్బు కూడా తిరిగి ఇవ్వబడుతుంది. అయితే, నిర్ణయం రాకముందే రుణగ్రహీత మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి అంగీకరిస్తే.. తప్పకుండా తీసుకోండి. ఎన్ని రోజుల్లో ఇస్తాడో అడగండి.. ఆ విషయాన్ని రాతపూర్వకంగా హామీ పత్రం రాసుకోవడం ఉత్తమం. మీ డబ్బు అంతా తిరిగి వచ్చిన తర్వాతే మీరు కేసును ఉపసంహరించుకోవాలి. కేసులో రాజీ పడాలంటే, రాజీ పిటిషన్‌ను మళ్లీ కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది. రెండు పార్టీల నుండి అభ్యంతరం లేకపోతే కోర్టు కేసును కొట్టివేస్తుంది. మీరు మీ డబ్బును తిరిగి పొందుతారు..ఇదే ఉత్తమమైన మార్గం.

ఇవి కూడా చదవండి :  Gold Price Today: కస్టమర్లకు షాకిస్తున్న బంగారం ధరలు.. పెరుగుతున్న పసిడి.. నిన్నటి కంటే ఈ రోజు ఎంత పెరిగిందంటే

Spitting in Public Places: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారిపై అధికారుల కొరడా.. ఇక నుంచి రూ. 1200 ఫైన్..!

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!