Gold Price Today: కస్టమర్లకు షాకిస్తున్న బంగారం ధరలు.. పెరుగుతున్న పసిడి.. నిన్నటి కంటే ఈ రోజు ఎంత పెరిగిందంటే
Gold Price Today: వినియోగదారులకు షాకిస్తోంది బంగారం ధర. రోజు రోజుకు ధర పెరుగుతూ దూసుకుపోతోంది. కరోనా మహమ్మారి కాలంలో తగ్గుముఖం పడుతుందని అనుకున్నా....
Gold Price Today: వినియోగదారులకు షాకిస్తోంది బంగారం ధర. రోజు రోజుకు ధర పెరుగుతూ దూసుకుపోతోంది. కరోనా మహమ్మారి కాలంలో తగ్గుముఖం పడుతుందని అనుకున్నా.. ఏమాత్రం ఆగకుండా పరుగులు పెడుతోంది. నిన్నటి కంటే ఈ రోజు కాస్త ఎక్కువ పెరిగింది. తాజాగా బుధవారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.230 మేర పెరిగింది. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,980 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,390 ఉండగా, 24 క్యారెట్ల రూ.50,600 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, రూ.47,900 వద్ద ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,970 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,300 వద్ద ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది.
కాగా, బుధవారం ఉదయం ఉన్న ధరలు ఇవి. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన పసిడి ధర.. మే నెల నుంచి పరుగులు పెట్టి కాస్త తగ్గుముఖం పట్టగా, ఇప్పుడు తాజాగా జూన్ నెల నుంచి మళ్లీ పై చూపులు చూస్తోంది. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు వ్యాపారవేత్తలు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్. అంతేకాదు.. ప్రస్తుతం 50వేలకుపైగా చేరిన పసిడి.. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.