State Bank of India: వినియోగదారులను మరోసారి హెచ్చరించిన ఎస్‌బీఐ.. జూన్‌ 30 వరకు గడువు విధింపు

State Bank of India: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి తన వినియోగదారులను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను..

State Bank of India: వినియోగదారులను మరోసారి హెచ్చరించిన ఎస్‌బీఐ.. జూన్‌ 30 వరకు గడువు విధింపు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 01, 2021 | 9:48 PM

State Bank of India: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి తన వినియోగదారులను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాలని కోరింది. అయితే పాన్‌ నెంబర్‌, ఆధార్‌ లింక్‌ చేసుకునేందుకు జూన్‌ 30 వరకు గడువు ఇచ్చింది ఎస్‌బీఐ. ఈ నెలాఖరులోగా లింక్‌ చేయనివారు తప్పకుండా చేసుకోవాలని కోరింది. ఒక వేళ లింక్‌ చేయకపోతే పాన్‌ కార్డు చెల్లుబాటు కాదు. కాగా, ఇప్పటికే దీనిపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనేక హెచ్చరికలు చేస్తూ గడువు పొడిగిస్తూ వస్తోంది. మే lనెలాఖరు వరకు ఉండే గడువు జూన్‌ నెలాఖరు వరకు పొడిగించింది. ఆదాయపు పన్ను చట్టం రూల్స్ ప్రకారం.. రూ.1000 జరిమానా పడుతుంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ తాజాగా ట్విట్టర్ వేదికగా బ్యాంక్ ఖాతాదారులు అందరూ కచ్చితంగా వారి పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలని కోరింది.

నిరంతరాయంగా బ్యాంకింగ్‌ సేవలు పొందేందుకు ఈ పని పూర్తి చేయాలని ఎస్‌బీఐ కోరింది. మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ద్వారా సులభంగానే పాన్, ఆధార్ లింక్ చేసుకోవచ్చు. క్షణాల్లో పని పూర్తవుతుంది. లేదంటే UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే సరిపోతుంది.

ఇవీ కూడా చదవండి:

Central Government: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు తీపి కబురు.. సామాన్యులకు భారీ ఊరట..!

LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిలిండర్‌ ధర

RBI: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం.. మరో బ్యాంకు లైసెన్స్‌ రద్దు.. అయోమయంలో కస్టమర్లు

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!