LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధర
LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట కలిగించే వార్త ఇది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ
LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట కలిగించే వార్త ఇది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ రోజు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్‌సిలిండర్ ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన సిలిండర్ ధరలు ఈరోజు నుంచే అంటే జూన్ 1 నుంచే అమలులోకి వచ్చింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషణ్ (ఐఓసీ) తాజాగా 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఐఓసీ వెబ్‌సైట్ ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.122 దిగొచ్చింది. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1473కు తగ్గింది. అలాగే మే నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.45 మేరకు తగ్గించగా, ముంబైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1422కు తగ్గింది. ఇక కోల్‌కతాలో కూడా సిలిండర్ ధర రూ.1544కు తగ్గింది. చెన్నైలో సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది.
అలాగే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఈ నెలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809 వద్ద ఉండగా, కోల్‌కతాలో రూ.835 వద్ద ఉంది. ముంబైలో సిలిండర్ ధర రూ.809 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.825 వద్ద ఉంది.