Spitting in Public Places: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారిపై అధికారుల కొరడా.. ఇక నుంచి రూ. 1200 ఫైన్..!

Spitting in Public Places: పరిశుభ్రత లేకపోవడం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ...

Spitting in Public Places: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసే వారిపై అధికారుల కొరడా.. ఇక నుంచి రూ. 1200 ఫైన్..!
No Spitting
Follow us

|

Updated on: Jun 02, 2021 | 7:21 AM

Spitting in Public Places: పరిశుభ్రత లేకపోవడం వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, రోడ్డుమీదనే ఉమ్మివేయడం తదితర అపరిశుభ్ర చర్యల వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు పరిశుభ్రతకు పెద్దపీఠ వేస్తున్నారు. రోడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. అదే సమయంలో అపరిశుభ్రతకు కారణమవుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ముంబై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఇప్పటి వరకు రూ. 200 ఫైన్ మాత్రమే విధించే వారు. అయితే, ఇప్పుడు ఆ జరిమానా మొత్తాన్ని రూ. 1200 పెంచాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది.

గ్రేటర్ ముంబై పరిశుభ్రత, పారిశుద్ధ్యం బైలా 2006 ప్రకారం.. ఈ ప్రతిపాదనను రాష్ట్రం ప్రభుత్వం ఆమోదించకున్నా.. బీఎంసీ జనరల్ బాడీ ఆమోదిస్తే సరిపోతుందని అక్కడి అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినందుకు ఇప్పటి వరకు రూ. 200 మాత్రమే జరిమానా విధిస్తూ వచ్చారు. అయితే, ఈ ఫైన్‌కు ప్రజల్లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచాలని డిసైడ్ అయ్యారు. కాగా, అధికారుల ప్రతిపాదనకు పరిపాలనా ఆమోదం లభించిన తరువాత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇదిలాఉండగా.. గత ఆరు నెలల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసిన వ్యక్తులపై రూ. 28.67 లక్షల జరిమానా విధించడం జరిగిందని అధికారులు తెలిపారు.

Also read:

Land Resurvey: ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు.. గ్రామాల్లో పట్టా భూముల రీసర్వేకు శ్రీకారం

Latest Articles
బాబోయ్ పులి...పట్టపగలు రోడ్ల వెంట పరిగెడుతూ ప్రజల్ని హడలెత్తిస్తూ
బాబోయ్ పులి...పట్టపగలు రోడ్ల వెంట పరిగెడుతూ ప్రజల్ని హడలెత్తిస్తూ
మరో 2 రోజుల్లో ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
మరో 2 రోజుల్లో ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల
ఏటీఎం నుంచి చిరిగిన, పాత నోట్లు వచ్చాయా? నో టెన్షన్‌..
ఏటీఎం నుంచి చిరిగిన, పాత నోట్లు వచ్చాయా? నో టెన్షన్‌..
నిబంధనలు జనానికేనా? అధికారులకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం..?
నిబంధనలు జనానికేనా? అధికారులకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం..?
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు
వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై
వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే
ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..
ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..
మామిడి గింజలతో బోలేడు లాభాలు... అనేక సమస్యలకు దివ్యౌషధం!
మామిడి గింజలతో బోలేడు లాభాలు... అనేక సమస్యలకు దివ్యౌషధం!
ప్రేమలు హీరోయిన్ పేరు మమిత కదా.. ?
ప్రేమలు హీరోయిన్ పేరు మమిత కదా.. ?